దృశ్యం-దరహాసం

కాలనీలో వాకింగ్ చేస్తున్న నాకు అలవోకగా కనపడిన దృశ్యాలు..
బడ్డీ కొట్టు నడిపే ముసలమ్మ – బేరానికై వచ్చిన ఓ పిల్లకి బిళ్ళలు అందిస్తూ..నీ పేరేంటే పిల్లా? అని ఆప్యాయంగా అడిగింది.
“ఐశ్వర్య ‘ అని ముద్దుగా చెప్పింది ఆ పిల్ల
మరి నీ చెల్లి పేరు? ….
ఈ లోగా ఆ దృశ్యానికి దూరమైపోతున్న నా నడకని ఓ సారి ఆపి ఆ పేరు వినేసి వెళ్ళనా అనిపించి..ఓ దరహాసం చిందించి సాగిపోయాను

ఇంకాస్త ముందుకు వెళితే..
అరవిరిసిన మందారాన్ని ఎగిరి అందుకోవాలని ప్రయత్నిస్తున్న ఓ పాపకి ఆ పువ్వు కాస్తా అందేస్తే బాగున్ను అని చిన్ని ఆశ!
ఇడ్లీలన్నీ అమ్మేయగా తేలికపడిపోయిన క్యారేజీలు ఉన్న సైకిల్ ని సునాయసంగా తొక్కుకుంటు హుషారుగా ఇంటి దారి పడుతున్న ఓ మధ్య వయసు అతన్ని చూస్తే ఓ తృప్తి!
చంటి పిల్లాడిని పడుకోబెట్టిన బండి ని ఓ చేత్తో తోస్తూ, మరో చేత్తో పట్టుకున్న స్మార్ట్ ఫోన్ లోకి తల దూర్చేసిన ఓ యూత్ ఐకాన్ ని చూసి..ఆ చంటాడి మీద పాపం ఓ కన్నేసి ఉంచితే బాగున్ను అని ఒక తపన!
తాత గారి చేతి వేలు పట్టుకుని ఆగకుండా కబుర్లు చెబుతూ తాత బోసి నోటిలో నవ్వులు పూయిస్తున్న ఓ గడుగ్గాయిని చూస్తే ముచ్చట!
రాత్రి జరిగిన విందు భోజనం తరువాత, అనుభావలాన్నీ తన ఇంట్లో పదిల పరుచుకొని, ఎంగిలాకులను కాలనీలో విసిరేసిన ఓ అసామిని చూస్తే ఆక్రోశం…
వీటిలో ఏ దృశ్యాలకీ నాకు ప్రమేయం లేదు. నేను వాకింగ్ కి వెళ్ళినా, వెళ్ళకపోయినా అవి సరిగ్గా అలాగే జరుగుతాయి. కానీ ఇవాళ ‘నా’ అనుభవం లో కొన్ని ఆనవాళ్ళు అయ్యాయి. ఈ దృశ్యాలన్నీ నాలో ఏదో ఒక చిరు భావాలను కలగజేసాయి. అవన్నీ కలగలిపి..వాకింగ్ అయాక నాకు ‘అహ్లాదం’ అనే అనుభూతి మిగిలి ఉంటుంది. ఆ అనుభూతితో నేను తర్వాత చేసే పనులు కొంచెం హుషారుగానో, ఆనందంగానో చేస్తానేమో. ఒక వేళ నాకు ఎదురైన దృశ్యాలన్నీ ఆ ఎంగిలాకుల బాపుతువే అయితే, వాకింగ్ తర్వాత నాలో కలిగే భావం ఏ అలజడో, ఆందోళనో అయి కూర్చుంటుంది.

మనం ఎవరికోసం ప్రత్యేకంగా ఏదీ చెయ్యం. కానీ మనం చేసి చిన్న చర్య కూడా వేరే వారి పై ఏదో ఒక ప్రభావం చూపిస్తుంది.
వేగంగా వెళ్ళిపోతున్న ఓ అపరిచితుడికి ఎదురయ్యే ఓ దృశ్యంలో నేను భాగం కావొచ్చు. ఆ దృశ్యంలో నేను మా అబ్బాయిని తిడుతూ కనపడి ఉండొచ్చు, లేదా ఏ బస్ కిటికి దగ్గరో ఓ పుస్తకం చదువుతూ కనపడి ఉండొచ్చు. సెకనులో వందో వంతైన…నా ద్వారా ఆ అపరిచితుడి మనసులోకి ఓ తిట్టు అనుభవాన్నో, ఓ పుస్తకం రూపాన్నో అతని మనసులో చేర్చేసి ఉండొచ్చు! అలా మనకి తెలియకుండానే వేరే వారి భావోద్రేకాలకి మనం కారణం అవుతాం. మనం పదే పదే కొట్టిన హారన్ వలన తెలియకుండానే ఒక అబ్బాయి తన ఇంటర్వ్యూ ని పాడు చేసుకుని ఉండొచ్చు. ప్రేమతో ఒక ముసలమ్మను రోడ్ దాటిస్తున్న దృశ్యం ద్వారా…జరగబోయే ఒక పోట్లాటని ఆపేసి ఉండొచ్చు.

నాకు వాకింగ్ లో కనపడిన మంచి దృశ్యాల వెనుక ఓ బామ్మ ఆప్యాయత, ఓ వ్యాపారి కస్టం ఓ తాత భాద్యత, ఓ చిన్నారి ముగ్ధత్వం లాంటివి ఉంటే, చెడు దృశ్యాల వెనుక నిర్లక్ష్యం, కోపం, ఓర్పు లేకపోవడం లాంటివి ఉంటాయి. మంచి ఆలోచన మనచేత ఒక రీజనబుల్ పనిని చేయిస్తుంది. అలాంటి పనులు చేసే మనం ఒక మంచి దృశ్యంలో భాగం అవుతాం. మనం తరచూ పాజిటివ్ దృశ్యాలలో భాగం కాగలిగితే, వేరే వారి పెదవుల పై చిరు దరహాసాన్ని పూయించొచ్చు. ఏమో ఆ చిరునవ్వు ఎవరి ఆర్తిని తీరుస్తుందో, ఎవరికి మంచిని చేస్తుందో?

4 వ్యాఖ్యలు to “దృశ్యం-దరహాసం”

  1. Srinivasa Ravitheja (SRT) Says:

    బాగా చెప్పారు. ఇది చదివాక, గురు గారి మాటలు గుర్తొచ్చాయి –
    “మనసులో నీవైన భావాలే పైకి కనిపిస్తాయి దృశ్యాలై, ఋతువులు నీ భావ చిత్రాలే.”.

  2. Deepthi Says:

    Excellent article…. Chinna feelings ni baaga gurtinchi chala chakkaga visadeekarinchavu!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: