శిశిరం…

వసంతాన్ని వర్ణించే కవులు, కావ్యాలు అనేకం. వసంతం వగలు, కోయిల పాటలు, మావి చిగుళ్ళు మనకు తెలియనివి కావు. కాని ఈసారి ఎందుకో ‘శిశిరం’ మీద నా శోధన మొదలైంది. మోడులు వారిన చెట్లను, శోభను కోల్పోయిన ప్రకృతిని చూస్తే ఏదో తాత్విక కోణం ఆవిష్కృతమైనట్లు అనిపిస్తోంది.

వసంతంలో పట్టు చీర కట్టినట్టు ఉండే ప్రకృతి – శిశిరంలో నార చీరను చుట్టి తన నిరాడంబరతను చాటుకుంటుంది.

సంవత్సరం అయిపోతోంటే పద్దులన్నీ లెక్క చూసి లాభ నష్టాలు బేరీజు వేసినట్లో, యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం దుకాణాలు కట్టేసినట్లో ప్రకృతి కూడా చెట్ల ఆకులు మొత్తం రాల్చేసి, పాత సరుకును దింపేసి – కొత్త చిగురుల సొగసులద్దుకోవడానికి సన్నద్దమయ్యే వేళ ఈ శిశిరం.

చెట్టు అంటె గుర్తొచ్చేది పచ్చదనం. పచ్చదనానికి ప్రతీకలు ఆకులు. కాని చెట్టు అంటే ఏంటో అసలు రూపాన్ని చూపించే గుప్త కాలం ఈ శిశిరం.
ఆకులు చెట్టుకి చిరునామా కాదు – అతిధులు మాత్రమే అని తేల్చేసి అబ్బుర పరిచే అపురూప కాలం ఈ శిశిరం.

ఒకో చెట్టైతే ఆకులు మొత్తం కోల్పోయినా పువ్వుల రూపంలో ఆశలను పూయించడం మాత్రం మానుకోవు.
పెనుగాలులకు, తుఫానులకు కూడా చెక్కు చెదరని ఓ వృక్షం..తను అనుకుంటే తనువంతా ఎలా ఆకులను రాల్చేయగలదో చూపిస్తూ భీష్మాచార్యుల వారి స్వచ్చంద మరణాన్ని తలపిస్తుంది (భీష్మేకాదశి ఈ ఋతువులో రావడం యాధృచ్చికమా?)

నేలన పర్చుకున్న ఎండుటాకుల తివాచీ పైన నడుస్తుంటే..నలుగుతున్న ఆకులు చివరిసారిగా సవ్వడి చేస్తూ వినిపించే ఓ ఫిలాసఫీ పాఠం…
ఏనాడొ నేలమ్మ కడుపున పుట్టిన చిన్నారి మొలక – తలెత్తుకుని, ఉవ్వెత్తున ఎదిగి,అనేకానేక ఆకులుగా మారి – ఆహారాన్ని తయారు చేసి పెట్టడం అనే పని క్రమం తప్పక చేసి, పండుటాకుగా మారి, ఎండుటాకుగా నేలకొరిగి, నేలన నలిగి తిరి పుడమి తల్లిలో మిళితమైపోతూ ఏం చెబుతోంది?

అసలు ఆకు చెట్టుని పోషించిందా? చెట్టు వల్ల ఆకులు పెరిగాయా?
ఏమైతేనేం? తమ వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన తృప్తితో ఆనదంగా అమ్మ ఒడిన చేరిపోతాయి.

ఈ ఆకులు ఏం చెప్పాయి? చిగుళ్ళు ఎంత సహజమో – మోళ్ళూ అంతే సహజం అని..

ఏదీ శాశ్వతం కాదు – కాల గమనానికి కారుణ్యం ఉండదు అని..

పచ్చని ఆకుగా ఉన్నపుడు తన వంతు పని చేసేయడం – ఆ రోజు మబ్బే కానీ, ఎర్రని ఎండే కాయనీ, మంచు బిందువులు కప్పేయనీ..
తన ఉనికి ఉన్నంత కాలం వేరొకరిని ఆహ్లాద పరచడం – తనకున్న పచ్చదనంతో, తనకు చేతనైన చల్ల గాలితో..
ఇక లయకారుడు శివయ్య పిలిచే కాలం రాగానే (శివ రాత్రి కూడా ఈ ఋతువులోనే రావడం కూడా యాధృచ్చికం కాదు కదా?)…
ప్రశాంతంగా నేల రాలడం – తన పరమావధిని చాటడం!

ఇలా శిశిరం తన సిలబస్ ని పూర్తి చేసి వెళ్ళనుంది. కాల చక్రంలో నా కర్తవ్యం ఏంటో గుర్తు చేసింది. ఈ విలువల పాఠం ఏడాదంతా నెమరేసుకోమని హెచ్చరించింది. నిరాడంబరతను మించిన నిధి లేదని మరో సారి నా చేత నోట్స్ రాయించింది.

ఒక స్పందన to “శిశిరం…”

  1. rajeshcherukuri83 Says:

    చాల అందంగా, అద్భుతంగ వివరించారు..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: