ఈ క్షణం…

ఈ క్షణం…ఇదే జీవితాన్ని నిర్దేశించేది.

గతం కరిగిపోతూ..భవిష్యత్తుకు బాటలు తెరిచే కూడలి..ఇదిగో అదే ఈ క్షణం
గతంలోని స్మృతులు, భవితలోని ఆతృతలతో నింపేస్తే ఈ క్షణానికి ప్రత్యేకమైన ఉనికి ఏదీ?
తన ఉనికిని చాటని ఈ క్షణానికి విలువేది?

గతమే బాగుందనో – భవిష్యత్తు బాగుంటుందనో ఊయలలూగే మనసుని ఈ క్షణం మీద కూర్చోబెట్టడమే వ్యక్తిగా మన విజయం.
గతం బాలేదనో – మున్ముందు ఎలా ఉంటుందనో అల్లల్లాడే ఆలోచనలను ‘ఇప్పుడు ‘ చట్రంలో బిగించడమే బహుశా నేను అనుకునే ధ్యానం.

ఈ క్షణాన్ని ఆస్వాదించగలిగితేనే జీవితంలో కొన్ని అనుభూతులు పోగుపడతాయి. నయాగరా వెళ్ళి జలపాతపు అందాలను ఈ క్షణం లో అనుభవించడం చేత కాక, ఫొటోలు తీసుకోవడంలో గడిపేస్తే ..మిగిలేది ఫొటో నే గాని, అనుభవం కాదు.

ఏదైనా పనిని రేపటికి వాయిదా వేసినా..తీరా ఆ పని చేసేప్పుడు ఉండే కాలం ఈ క్షణమే! ఎంతో కాలం ఎదురు చూసిన రోజు రాగానే – ఆ రోజు తెల్లారగానే మన కోసం దేవ దుందుభులు ఏమీ మోగవు. దేవతలు పూల వానలు కురిపించరు. ‘ఆ రోజూ’ సరిగ్గా ‘ఈ రోజూ’ లాగే ఉంటుంది. ఏమి తేడా లేదు – ఒక్క మనసులోని ఉత్సాహం తప్ప! మరి ఆ ఉత్సాహం ఏదో ఇవాళే, ఈ క్షణమే తెచ్చేసుకుంటే పోలే?

ఈ క్షణం మీద ఎరుక ఉంటే అనుకోని అతిధిలా వచ్చే కోపం అక్కడే ఆగిపోతుంది. అలసత్వం ఆమడ దూరంలో ఉంటుంది. చేసే ప్రతి పని అపురూపంగా అనిపిస్తుంది, మదిని చేరి మురిపిస్తుంది.

కాలమనే సాగరంలో ‘ఈ క్షణం’ నావలో ఎక్కి కూర్చుంటే అది చేరాల్సిన గమ్యానికి చేర్చెస్తుంది. కాని మనసుకెందుకో ‘ఈ క్షణం’ అంటే పెద్దగా నచ్చదు.అనంత కాల సాగరంలో అది అలవి కాని ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటుంది. ‘ఇక్కడ’ కుదురుగా కూర్చోవడం చేత కాక అలసిపోతుంటుంది, అలమటిస్తుంటుంది.

‘ఈ క్షణం’ బాగుంటే జీవితం ఖచ్చితంగా బాగుంటుంది. ఈ క్షణం లో గడపగలిగితే ప్రతీ క్షణం నిజంగానే బాగుంటుంది. ఈ క్షణాన్ని తప్పించుకు తిరగడం మనసుకి అలవాటు. ఎలా మనసుని దానికి ముడి వెయ్యడం? ‘ఈ క్షణం’ ఒకటే అయినా మనసులు వేరు కదా. కాబట్టి ఎవరి మనసును వారు శోదిస్తే గాని దీనికి సమాధానం దొరకదు.

 

2 వ్యాఖ్యలు to “ఈ క్షణం…”

 1. YVR's అం'తరంగం' Says:

  Poetry=Philosophy=Science=Poetry=………..
  చాలా బావుంది. _/\_ 🙂

 2. kiran Says:

  awesome poetry
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: