‘రొటీనే’ జీవితం!

జీవితం రొటీన్ గా ఉంది అంటూ ఉంటాం కాని, నిజానికి రొటీనే జీవితం అనిపిస్తుంటుంది నాకు. అసలు జీవితం బాగుండటం అంటే ఏంటి? మన రోజు బాగుండటం. అలా…చాలా రోజులు, అన్ని రోజులు బాగుండటం. ఒక రోజు ఎలా బాగుంటుంది? జరగాల్సినవన్నీ సక్రమంగా, సౌకర్యంగా జరిగితేనే కదా! రోజూ రావాల్సిన పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ రాకపోయినా, పిల్లలు వెళ్ళాల్సిన స్కూల్ బస్ ఆలస్యంగా వచ్చినా, వేళకి రావల్సిన పని మనిషి రాకపొయినా, పైపులో నీళ్ళు ఆగిపోయినా, వారంలో జరగాల్సిన పనులు ఏమి తేడా వచ్చినా, వారంతంలో తెచ్చుకోవాల్సిన కూరగాయలు తెచ్చుకోకపొయినా, నెలకోసారి వచ్చే జీతం రాకపొయినా, సంవత్సరంలో మారాల్సిన ఋతువులు మారకపోయినా. పిల్లలు పెద్దలుగా, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళుగా మారి..చివరికి చనిపోవాల్సినప్పుడు చనిపోకపోయినా..జీవితం బాలేదేమో అనిపిస్తుంది కదా..
ఇలా మన దైనందిన జీవితంలో ఒక రోజు నుండి నూరేళ్ళ జీవితంలో ఏదైనా జరగడం, జరగాలనుకోవడం..రొటీన్ కాక, ఇంకేంటి? ఈ రొటీన్ ఇలా జరగకపోతే మనం ఏంటి? అంటే ఆలోచిస్తే రొటీనే కదా జీవితం. మరి జీవితం రొటీన్ గా ఉంది అనుకోవడం ఎంటి? విడ్డూరం కాకపొతే?
జీవితమే రొటీన్ అని తెలుసుకున్న నాడే అది నిజంగా రొటీన్ అనిపించదు. ప్రతి రోజు మనం చేసే పనులు, ప్రతి రోజు మనం కలిసి గడపాల్సిన మనుషులు, మనసులో తిరిగే ఆలొచనలు, వ్యక్తం చేసే భావాలు..అన్నీ ఒక రకంగా రొటీనే. ఒక వేళ కొత్త కోసం ఏమైనా ప్రయత్నించినా అది రొటీన్ అయిపోవడానికి ఎంత సేపు పడుతుంది? ఉదాహరణకి, ప్రతి రోజు ఇంట్లోనే ఏమి తింటాం, ప్రతీ ఆదివారం బయట తిందాం అనుకుంటే…అలా 4 ఆదివారాలు తినేసరికి, ఆదివారానికి బయట తినడం అనేది రొటీన్ అయి కూర్చుంటుంది. ప్రతి ఉదయం సూర్యోదయం చూస్తూ వాకింగ్ చేద్దాం అనుకుంటే..రోజూ లేవగానే వాకింగ్ చేయడం అనేది రొటీన్ అయిపోతుంది.
కాని రొటీనే కదా సుందరం, అనివార్యం, జీవిత పరమార్ధం. ఒక మొక్కకి రొటీన్ గా రోజూ నీళ్ళు పోసి పెంచితేనే కదా కాయలు కాసేది. అమ్మగా పిల్లలకి లెక్కలేనన్ని రొటీన్ పనులు క్రమం తప్పక చేస్తేనే కదా మంచి పౌరులుగా ఎదిగేది. ఒక రోగం తగ్గాలంటే రొటీంగా మందులు వేసుకోవాలి, ఒక ప్రోజెక్ట్ విజయవంతం అవాలంటే రొటీన్ గా అన్ని టాస్కులు చేసి తీరాలి. మంచి అలవాటు అంటే ఒక రొటీన్, చెడు వ్యసనం అన్నా ఒక రొటీనే! మన రొటీన్ ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుంది. మన జీవితం ఎలా ఉండాలనుకుంటే మన రొటీన్ అలా ఉంటుంది. కాబట్టి జీవితం రొటీన్ గా ఉంది అనుకోవడం కంటే, రొటీనేరా బాబు జీవితం అనుకుంటే..మన రోజు బాగుంటుంది..జీవితమూ బాగుంటుంది.

3 వ్యాఖ్యలు to “‘రొటీనే’ జీవితం!”

 1. kiran Says:

  nice blog
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

 2. Srinivasa Ravitheja (SRT) Says:

  🙂 Routine ki bhinnangaa routine gurinchi raasaaru 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s


%d bloggers like this: