నేను తెలుసుకుంటున్న జ్ఞానం

నాకు ఫిలాసఫీ కి, స్పిరిట్యులాటీకి పెద్ద తేడా తెలీదు కాని, ఈ మధ్య కాలంలో చదివిన కొన్ని పుస్తకాలు, విన్నవి, తెలుసుకున్నవి – ఈ రెండిటిలో ఏదో ఒక దానికి చెందుతాయి.అసలు దేనికి చెందితే ఏమి కాని, ఫిలాసఫి చదువుతున్నా అంటుంటే మాత్రం కొందరు స్నేహితులు – నీకు ఈ వయసులో ఈ వైరాగ్యం ఎందుకు అంటున్నారు. కాని నేను చదివినవి, తెలుసుకుంటున్నవి నేను జీవితాన్ని మరింత మెరుగ్గా తీర్చి దిద్దుకోవడానికి ఉపయోగపడుతున్నాయి, కాబట్టి నా చుట్టు పక్కల వాళ్ళకి అసలు నేను ఎమి చదువుతున్నానో చెప్పకుండా, ఏమి తెలుసుకుంటున్నానో చెప్పే ప్రయత్నమే ఈ పోస్ట్..
నేను తెలుసుకున్న విషయాలు నాకు ఎలా ఉపయోగ పడుతున్నాయో కొన్ని ఉదాహరణలు, ఆలోచనలు…

ఎక్కువ ఫిలాసఫీ చదివితే దేని మీదా ఇస్టం ఉండదేమో అని   ఇది వరకు అనుకునే దాన్ని, కాని మనిషికి జ్ఞానం రావడం అంటే, అన్నిటి మీద ప్రేమ వదులుకోవడం కాదు – అన్నిటిని, అందరిని ఒకేలా ప్రేమించగలగడం, ఇంకా చెప్పాలంటే అందరి కంటే ఎక్కువగా ఈ ప్రపంచాన్ని ప్రేమించగలగడం (మన కంటే కూడా). ఈ దృక్పధం  తో చూడటం మొదలెడితే రోజు చూసే ప్రపంచం, మనుషులు ఎంత ఇస్టం గా కనిపిస్తారొ…అన్నిటి కంటే అబ్బుర పరిచేది మనిషి మేధస్సు…మనుషులు అందరూ ఒకటే అని చూడటం మొదలెడితే…మొత్తంగా మనుష్యులుగా ‘మనం’ ఎంత ప్రగతి సాధించామో కదా…ఒక మంచి పుస్తకం చదివినపుడు ఆ రచయిత ఊహా శక్తి కి, ఒక మంచి సినిమా నో , డాన్స్ నో చూసినపుడు మనిషిలోని కళాత్మక నైపుణ్యానికి ఇలా ప్రతి చోటా మరో ‘మనిషీ గా అబ్బుర పడుతూ, గర్వ పడుతూ ఉండటం మొదలేడితె అసలు మనకు పక్క వాడిని చూసి అసూయ చెందాల్సిన అవసరమే రాదు, ప్రత్యేకించి మనం బతుకుతున్న ‘నాలెడ్జ్ వర్కర్శ్ ఏరాలో!   ఆఫీస్ లో ఎవరైనా మంచి ఐడియా ఇస్తే మనసారా అభినందించడం, మా అబ్బాయి కంటే మరో బాబు/ పాప మంచి మార్కులు తెచ్చుకుంటేనో/ ఒక మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తేనో అసూయ చెందకుండా ఉండటం అలవాటయింది. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే – స్కూల్ ఫంక్షన్ లో మా బాబు ఇంకో ఇరవై మంది పిల్లలతో పాటుగా డాన్స్ చేస్తే, ఆ 10 నిమిషాలు వాడిని మాత్రమే కాక- మొత్తం డాన్స్  ని చూసి ఆనందించగలిగలగడం నేర్చుకున్నాను.

చాలా సార్లు మనుషుల మద్య గొడవలు ఎందుకు జరుగుతాయి?లేక మనకి బాధ ఎందుకు కలుగుతుంది? ‘నా’ ఆనందాన్ని ఎవరో చెడగొడుతున్నపుడు.   ఇక్కడ ‘ఆనందం’ కంటే ‘సౌకర్యం’ అని పదం వాడితే ఇంకా క్లియర్ గా ఉంటుంది. సినిమాకి టికెట్స్ దొరకకపోవడం, అనుకున్న ట్రిప్ కి అనుకున్న రకంగా వెళ్ళకపోవడం, నాకు ఏకాంతం లేకపోవడం,కరెంట్ పోయి దోమలు కుట్టడం, పిల్లాడికి ఆ రోజు హోం వర్క్ చెయ్యాలనిపించకపోవడం, చుట్టాలు ఎక్కువ వచ్చి మనకి విశ్రాంతి లేకపోవడం, ఆఫీస్ లో ప్రమోషన్, హైకు రాక అనుకున్న కారు కొనుక్కో లేక పోవడం, ఒక్క పూట పని మనిషి రాకపొటే ఇల్లు ఊడ్చుకోవాల్సి రావడం…మన రోజు వారి జీవితంలో ఎన్నెన్ని లేవు ఇలా మన ‘ఆనందాన్నీ దోచుకుని ‘బాధ ని తెచ్చిపెట్టేవి!

ఇవేమి నా రోజు వారిలో మార్పు రాలెదు, కాని నా ఆలొచనా విధానంలో మార్పు వచ్చింది. అసలు ఇవన్ని నా ఆనందాన్ని పాడు చేస్తున్నాయా? లేక నా ‘సౌకర్యాన్నా?’ అని ఆలొచించడం మొదలెట్టను. చివరికి తేలిందేంటి అంటే, అసలు ఆనందం ఉన్నది నా ఆలొచనా విధనంలో తప్ప ఏ ఒక్క వస్తువు / వ్యక్తి, సంఘటన లో కానే కాదు. కరెంట్ లేదు – తెప్పించడం నా చేతుల్లో లేదు, కాని ఆ కారణంగా అనందం కోల్పొవాలో వద్దో నా చేతుల్లోనే కదా ఉంది. అసలు ఇంకో నిజం ఏంటి అంటె, ఆనందం అనేది తీసుకోవడం లో లేదు – ఇవ్వడం లో ఉంది. ఒక వారంతం లో 2 గంటలు ఏదో ఒక రెస్టారెంట్ కి వెళ్ళి తిని బిల్ కట్టి తీసుకునేది ఆనందమా, లేక ఆ రెండు గంటలు ఒక మంచి పిండి వంట చేసి అది కుటుంబంలో  అందరూ తృప్తిగా తింటూ ఉంటే కలిగేది ఆనందమో నాకు బాగా అర్ధం అవడం మొదలయింది. ఇది వరకు శారీరిక / మానసిక శ్రమ అనేది ‘దుఖం ‘ అని భ్రమ పడేదాన్ని. కాని అది దుంఖం కాదు ‘సౌకర్యం’ లేకపోవడం మాత్రమే. సౌకర్యం గా లేకపోవడం వలన దుఖం కలగాల వద్దా అనేది నా చాయిస్ కదా! ఆనందం అనేది ఇవ్వడం లో ఉంది అని తెలుసుకుంటే మన చుట్టు ఎన్ని మార్పులు వచ్చేస్తాయో. అసలు అప్పుడు మనం అవతల వాళ్ళకి ఏమి ఇవ్వగలం – వారి ఆనంద కారకంగా మనం ఎలా మారగలం? అనే కోణం లో ఆలోచనలు తిరుగుతాయి. అసలు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలిగా. ఒకరికి మనం చేసే పని ద్వారా, మరొకరికి సాయం ద్వారా, వేరొకరికి ప్రశంస ద్వారా ఇలా మనకి తోచిన రకాలుగా, వీలైనంత మందికి ఆనంద కారకాలుగా మారగలం. మనం ఇచ్చే వాళ్ళ లిస్ట్ లో ఉంటే – మనని ఇస్ట పడే వాళ్ళ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు లోకం అంతా అందంగా – ఆనందంగా కనిపిస్తుంది.

ఇలాంటి జ్ఞానం నేర్చుకునే కొద్దీ మన ఆలొచనా విధానం మెరుగు పడుతుంది. జీవితం మరింత సౌందర్యం గా కనిపిస్తుంది. ఇలాంటి జ్ఞానం  60 ల వయసులో చదివి ఏం లాభం?  30 ల లో చదివితే జీవితానికి ఊతంగా ఉంటుంది కాని. ఈ జ్ఞానం మన భారతీయ సంస్కృతి లో ఉంది. ఈ మూలాల ఆధారం గా ఈ కాలం లో బోలెడన్ని మేనేజ్మెంట్ ప్రోగ్రాంస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ వస్తున్నాయి. ఎవరో ఫారిన్ ఆదర్ రాస్తే కొత్తగా తెలుసుకుంటునట్టు ఉంటుంది కానీ, మన భారతీయ ఆత్మ తో చూస్తే ఇవన్నీ మన తత్వ, ఆధ్యాత్మిక గ్రంధాల్లో దొరికేవే! మనం మూలాలను వదిలేసి, ఏవో కొమ్మలను, ఆకులను పట్టుకుంటాం.
ఈ ఉదాహరణ ఈ సందర్భానికి సరిపోతుందో లేదో కాని – మా ఎదురింటి ఫ్లాట్ లో  ఉండే వాళ్ళ ఇంటికి , అమెరికా లో ఉండే చుట్టాల అబ్బాయి మా అబ్బాయి వయసు వాడు వచ్చాడు ఆ మధ్య. వాడు మా వాడితో మాట్లాడుతూ ‘నా’ ఇంటికి వస్తావా? ‘నా’ తమ్ముడు ఇలా అన్నిటికి ‘నా’ అని వాడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి ఇబ్బందే – ఆ ఫీస్ లో ఎవరైనా ‘నా’ కార్, ‘నా కొడుకు అని చెప్పినా కలుగుతుంటుంది నాకు. మన సంస్కృతి లో ‘మా’ అని చెప్పడం అలవాటు కదా. మా ఇల్లు, మా అబ్బాయి, మా కారు అనే పదాలు బాగుంటాయి. అలా మాట్లడుతుంటే నేను అంటే నా కుటుంబం అనే భావన వ్యక్తమవుతుంది. కార్పొరేట్ భాష లో చెప్పలంటే  ‘నేనూ అనుకోవడానికి, ‘మనమూ అనుకోవడానికి తేడా – ఒక ‘మేనేజరు ‘ , ‘లీడరు ‘ కి ఉన్నంత!

ప్రకటనలు

9 వ్యాఖ్యలు to “నేను తెలుసుకుంటున్న జ్ఞానం”

 1. Ckant Says:

  Nijamenandi…. yee post chadivakaa naaku ilanti books chadavalanipisthundi…… oka manchi book ni refer cheyandi…. nenu kuda manchi manishi ga maripothanu..

 2. dkraju Says:

  veary exlent mataru

 3. yandamoori veerendranath Says:

  can i use few sentenses from this, in my upcoming book? just few lines.. yandamoori.

 4. vijaya Says:

  ఏంటీ? నిజంగా యండమూరి గారు ఈ పోస్ట్ కి కామెంట్ రాయడమా? అదీ ఇందులో లైన్స్ ఆయన బుక్ లో వాడుకోవడమా???నేను సరిగ్గానే చదివాను కదా? తప్పకుండా సర్…అంతకంటే భాగ్యమా! నేను ఇలాంటి జ్ఞానం దిశగా ప్రయాణం చేయడానికి మీ పుస్తకాలు ఖచ్చితం గా నాకు ప్రేరకాలు.

 5. Lalitha. lalli Says:

  Dear vijaya madam,

  mee post chadivaka andulo especially ’60 ల వయసులో చదివి ఏం లాభం? 30 ల లో చదివితే జీవితానికి ఊతంగా ఉంటుంది’ it is correct, 60 lo ayte life almost complete aypotundi kada…..nenu kuda epude realize ayyanu naku jnanam pondalani vundi danikosam vetukulatalo me post chusanu chala bagundi if u dont mine manchi books evayina refer chestaru naku ani korukuntunnanu

  Mee reply kosam wait chestuntanu..

 6. rathnam Says:

  మన హిందూ ధర్మ వేదాలలో ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందఱో సద్గురువులు, జగద్గురువులు చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మ జ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మ జ్ఞానం. అంటే ఎవరైతే గురువు బ్రహ్మ విద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మ జ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన BB.Tech,MBA,MCA,MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మ విద్య కాదు.
  సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ ఏది ఆత్మ? ఏది అనాత్మ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు? “దేవుడు” ఎవరు? ఈ శరీరము, మనస్సు,బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది, ఎవరు సృష్టించారు, నేను ఎందుకు పుట్టాను. ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు

  జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి

  • yndvijaya Says:

   మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాధాలు. మీరు చెప్పింది అక్షర సత్యం.ఇలాంటి జ్ఞానం అసలు ఉంది అని కూడా ఈ తరానికి తెలియడం లేదు. ఉద్యోగం దిశగా సాగే చదువులలో ఇలాంటి జ్ఞానం ఇచ్చే గురువులు ఎవరు? నిజమైన జ్ఞానం ఉంటే జీవితం సంతృప్తిగా ఉంటుంది. ఈ ప్రయాణంలో నేను చాలా తొలి అడుగుల్లో ఉన్నాను. కానీ..కనీసం ప్రయాణం అంటూ మొదలుపెట్టాను.

 7. Prabhakar Rao K Says:

  Vijaya, mee article chaalaa bagundi..manalo jarige alochanala maarpuni, jnanam disagaa manam prayaanam chesetappudu manaku lokam yelaa ardamu avuthundi, mariyu paristhithulu yelaa chakkagaa ardhamu avuthayoo..chalaa bagaa cheppaaru…

 8. kiran Says:

  wow nice blog
  hi
  We started our new youtube channel : Garam chai . Please subscribe and support
  https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: