వాటికే మనసుంటే…

ముందు వెనక చూసుకోకుండా ఏది పెడితే అది నోట్లోకి తోసేస్తు ఉంటాం…కుదురుగా కుర్చుని ఆలొచిస్తే అనిపిస్తుంది-మనం కానీ తినడానికే పుట్టలేదు కదా అని!ఆహారాన్ని తీసుకోడంలో బాగం అయిన మన శరీర భాగాలకే కనుక మనసు ఉంటే (అంటే మన శరీరం అంతటికి ఒకటే కాకుండా-ఒక్కో భాగానికి ఒక్కో మనసు ఉంటే)…అవి ఎలా ఆలొచిస్తాయొ తెలుసా…బహుశా ఇలా ఏమో….

చేతులు:అదేంటిరా…ఎప్పుడు ఏమి తినాలన్నా నాకు పని చెప్తావు,తనివితీరా నన్ను నాకి నాకి పెడతావు,ఇవాళ స్పూన్ గాడితో ఆ పని చేయిస్తున్నవు? ఓహ్..నువ్వు పార్టీలో ఉన్నావా?? చూడలేదురా…సరే కానీ,ఇవాల్టికి వెచ్చగా (అంటే పొడిగా) విశ్రాంతి తీసుకుంటా…

నాలుక:ఇందాక వేడి వేడి కాఫీ పోసి నన్ను కాల్చేసి,ఇప్పుడు ఈ కొత్త ఆవకాయ ఎలా ఉందో రుచి చూసి పెట్టమంటే నేనెలారా చేసేది? సరే-ఏదొ ఒకటి తగలెయ్యి నాకు తోచింది చెప్తాను…

గొంతు:ఆహా…మండుటెండలో తడారిపోతున్న నాకు చల్లని కొబ్బరి నీళ్ళు పోసి ప్రాణం పోసావు…థాంక్సోయ్…అయ్యో..నేనింకా తేరుకోలేదురా బాబు,అప్పుడే మిరపకాయ బజ్జీలతో దాడి చేసేస్తున్నావు,నీ తిండి పాడు గాను…కాసేపు వదలరా నాయనా!

జీర్ణాశయం:జున్ను,జిలేబి,పనస తొనలు,బిర్యాని,అదేదొ పానీయం(కూల్ అంతా ఆ నాలుక,గొంతు తీసెసుకుని తోసేసింది),కోవ,చాక్లేట్,బర్గర్…వామ్మొ ఎంటిరా బాబు ఇన్ని తోసేస్తున్నవ్ ఇవాళ?కొంప దీసి హాలిడేనా ఎంటి?అయితే నా పని ఔటే ఇవాళ.. ఇక్కడ చస్తున్నారా మర ఆడలేక,యంత్రం తిరగట్లేదు, కనీసం కొన్ని నీళ్ళైనా పొయ్యరా బాబు…

క్లోమము,జీర్ణ గ్రందులు:గారెలు-అరటి పండు,దద్దోజనం-టీ,బటాణీలు-బిస్కట్లు….ఒరేయ్,ఎంట్రా బాబు ఈ కాంబినేషన్ లు, వీటిలో ఏది అరిగించాలి-ఏది కరిగించాలి?అసలు నేను ఏ రసం అని స్రవించాలి?నీరసం వచ్చేస్తోంది

పళ్ళు:ఇదేంటిరా ఇవాళ జీడి ఇచ్చి ముక్కలు చెయ్యమంటున్నావ్?నేను గట్టిగా పని చేసి ఎన్నాళ్ళు అయిందో నీకు తెలీదా ఏంటి?నువ్వు అన్నీ గబుక్కుమని మింగేసేవే తింటూ,కనీసం వేటిని నా కింద కాసేపు కూడా ఉంచమని అడగకపోతే-ఇంక నాతో పనేం ఉందిలే అని హాయిగా పడుకున్నా…ఇప్పుడూ ఇలా హఠాత్తుగా వచ్చి చెరుకు
గడలు చీల్చమని,జీడి నమలమని చెప్పకురా బబూ-దాదాపు రిటైర్ ఐపొతున్న బపాతు గాన్ని!!

ఈసారి ఏది పెడితే అది లోపలకి తోసేసే ముందు మన శరీరంలో భాగాలు ఎమనుకుంటున్నాయో పాపం.. అని ఒకసారి ఆలొచించండేం!!

5 వ్యాఖ్యలు to “వాటికే మనసుంటే…”

 1. తెలుగు 'వాడి' ని Says:

  హహ్హహ్హహ్హ … చాలా బాగుంది … ఆయా అవయవాలకు మీరు తీసుకున్న తినుబండారాల కాంబినేషన్ సూపరో సూపర్ మరియు వాటి వ్యాఖ్యానం అదుర్స్.

 2. ప్రవీణ్ గార్లపాటి Says:

  హహ… భలే.

 3. నిషిగంధ Says:

  :)))

 4. వల్లూరి Says:

  ఇలా అవయవాలన్నిటికి ఆలోచనశక్తి వస్తే, అవన్ని కూడబలుక్కోని అర్ధంతరంగా సమ్మె చేస్తే కడుపు మాడే ప్రమాదం ఉందండి బాబు!.(ఎన్టీర్ – యమగోల సీనిమా గూర్తుందా?)

 5. radhika Says:

  adhurs.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: