చిన్నారుల చిట్టి మనసులో….

వారాంతం కావటంతో మద్యహ్నం భోజనం చేసి సన్నగా కునుకు తీస్తున్నా.మా బాబు నా దగ్గరే కూర్చుని వాడి బొమ్మలతో ఆడుకుంటూ,నాకు ఏవేవో మాటలు చెప్తున్నాడు.మద్య మద్య నేను వింటున్నానో లేదో అని నన్ను కదుపుతూ,బిగ్గరగా చెప్తూ ఆడుకుంటున్నాడు.అందుకని మగత నిద్రలా ఉంది నాకు-వాడు చెప్తున్నవి వినపడుతున్నట్టే ఉంది,మరో పక్క మత్తుగా ఉంది.హఠాత్తుగా…’వర్షం-అమ్మా,లే వర్షం’ అన్నట్టు వినపడింది.వాడి ఆటలో అది ఒక భాగం ఏమోలే అని ఊరుకున్నాను.మరలా గట్టిగా అరుస్తున్నాడు, లే అమ్మా-వర్షం వస్తూందీ…అని ఈ సారి తట్టి మరీ లేపాడు.ఏంటా అని చూస్తే,నిజంగానె వర్షం కురవడం మొదలైంది బయట, అది వాడికి బాల్కనీ లో నుండి కనపడింది,ఎం చెయ్యాలో తోచట్లేదు వాడికి.నన్ను లేపి లాక్కెల్లిపోయాదు.వాళ్ళ తాతకి,నిద్ర పోతున్న నానమ్మ కి అందరికి వర్షం వస్తూంది అని చెప్పి హుషారుగా ఎగురుకొంటూ వచ్చాడు.వర్షం అంటే నీళ్ళు పడటం అని,తడిచిపోవడం అనీ తెలుసు వాడికి.బాల్కనీ లోకి వెళ్ళి నిలబడ్డాక-వాడిని ఎత్తుకోమన్నాడు. ఇప్పుదు వాడికి వర్షం తాలుక పూర్తి చిత్రం కనిపించింది.వర్షం పై నుంచి పడుతుంది అమ్మా అన్నాడు.ఓహ్,నిజమే కదా-చినుకులు వస్తాయి అన్న విషయం తెలుసు కాని(ఇది టీవీలో,సినిమాలో అలా చూసి తెలుసుకుంటారు) అవి పై నుండి-అంటే ఆకాశం నుండి పడతాయి అన్న విషయం పరిశీలన ద్వార మాత్రమే తెలుస్తుంది కదా, వీడికి ప్రకృతి ని పరిశీలించడమే కాక,అర్ధం చేసుకోవడం కూడా మొదలెట్టడన్న మాట అనిపించింది.మా గోడ అవతల ఒక ఖాళి స్థలం ఉంటుంది. అందులో ఒక కుక్క నిలబడి ఉండి,తడిచిపోతొంది.అంతక ముందే వర్షం పడుతుందని గబ గబా ఆరిపోయినా బట్టలు నేను హడావిడిగా తీసి లోపల వేయ్యడం చూసాడు.దాన్ని చూసి-‘బౌ బౌ నువ్వు తడిచిపోతావ్,వెల్లిపో-స్ట్రైట్ గా వెల్లిపో, అయ్యో అమ్మా,బౌ బౌ తడిచిపోతోందీ అని ఒకటే బాధ పడిపోయాడు.బయటకి చేతులు చాపి టప టప పడే చినుకులు వాడి చిట్టి చేతుల పై పడి గిలిగింతలు పెట్టినట్టు అయి పక పక నవ్వుకున్నాడు.ఆ పరవశం లో వాడికి వెంటనే ఒక పాట గుర్తొచ్చింది.’వాన వాన వల్లప్ప-వాకిలి తిరుగు చిన్నప్పా’.వాడికి అటు ఇంగ్లీష్ రైంస్, ఇటు తెలుగు పాటలు రెండూ నెర్పిస్తూ ఉంటాను.అసలు అవి నేర్పేప్పుడే నాకు అనిపిస్తూ ఉంటుంది బాలల తెలుగు పాటలు మన సన్స్కృతి కి,దైనందిన జీవితానికి దగ్గరగా ఉంటాయి అని.అనుకున్నట్టే అవి చక చకా వచ్చేస్తాయి,ముఖ్యంగా సమయానికి తగ్గట్టు ఏమి పాడాలో స్పురిస్తుంది వాడికి.

పై ఉదాహరణే తీసుకుంటే, ‘రైన్ రైన్ గో అవే’ కూడా వాడికి వచ్చు,రైన్ అంటే వాన అన్న విషయం కూడా వాడికి తెలుసు. కాని వాడికి ‘వాన వాన వల్లప్పా పాటే ఎందుకు పాడలనిపించంది? ఎందుకంటే అది మన సన్స్కృతి.వాన వస్తుంటే పిల్లలు ఎవరికైన అందులొ కేరింతలు కొడుతూ ఆడాలనిపిస్తుంది.మన తెలుగు పాటా ఆ భావానికి దగ్గరగా ఉంటుంది.అదే ఇంగ్లీష్ పాట అయితే-‘వానా నువ్వెల్లిపో-నేను ఆడుకోవాలీ అని అర్ధం వస్తుంది.పిల్లలకి వానలో తడవటమే పెద్ద ఆట.వాళ్ళు ఆడుకోడానికి ఒక సమయం,సంధర్భం ఉండాలా (మనం ఆఫీస్,ఇంటి పని చేయడానికి ఉన్నట్టుగా!!).మన ఆట పాటలు ప్రకృతి ని ఆశ్వాదిస్తూ మన వాతవరణం,పరిసరాలతో మమేకం ఐపోతూ,అందులో ఒక భాగంగా ఉంటాయి.ఇంగ్లీష్ రైంస్ పాడుకోడానికి బానే ఉంటాయి కాని,అందులో లీనమయ్యెట్టు-ఆ సంధర్భం వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునేట్టు ఉండవు పిల్లలకి.ఇక్కడ పిల్లలు అంటే మన తెలుగు పిల్లలు అని.మన మాతృ భాష ని ఉగ్గు పాలతో వంట పట్టించుకునే చిన్నారులకి బాల తెలుగు గీతాలే చాలా దగ్గరగా ఉంటాయేమొ అని నా అభిప్రాయం.సరదాగ పాడుకోడానికి ఎన్నైనా నేర్పొచ్చు. కాని వాళ్ళ అనుభూతులకు దగ్గరగా,వాళ్ళ ఆలోచనలను ప్రేరేపించేట్టు మాత్రం ఎవరి మాతృ భాషలోని పాటలే వాళ్ళకి నేర్పాలేమో అనిపించింది ఆ క్షణం!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “చిన్నారుల చిట్టి మనసులో….”

 1. ప్రవీణ్ గార్లపాటి Says:

  బాగుంది. మీ వాడిని ఇలాగే ప్రోత్సాహించండి. 🙂

 2. lalitha Says:

  First, I appreciate your little one’s enthusiasm and observation.
  Then, my cynicism. “Rain, rain go away” is when you have to run inside because you cann’t play oustide becuase of the rain.
  He is inviting rain. So, he remembered the suitable rhyme. I guess that’s something to be appreciated more about your son too.

  Then, yes, it’s the environment. For those living abroad, there’s a lot missing. And so, mother tomgue is a second language for most.

  Now, a request: kindly remind us of some more appropriate rhymes in Telugu which revolve around daily life. That would be a great help to parents like me.

  Next, an observation: Here they make simple songs and rhymes around parts of body, seasons, colors, spellings, counting backwards. They are all very catchy tunes and simple enough to be played on even keyboard by even those who never knew music.

  Head, shouldrs knees and toes….
  Ten little Indians

  There are people like Dr Seuss and Eric Carle who write for kids as though they were kids themselves. The quality of literature in terms of enriching vocabulary, illustrations in terms of attractiveness and imagination, and fun in terms of being simple and hilarious and yet educative…

  I am not saying we don’t have it. I am saying we need to bring it close to kids and parents and make it our business to do so.

  I am also not a great fan of spongebob or the tween and teen TV shows. That’s another story for later.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: