అమ్మ నేర్పిన చిన్ని ఆనందాలు..

చాల చిన్న సంఘటనలే, నిత్య జీవితంలో మనం చేసే పనులే –
ఆ పనులను చేసే విధానమే వ్యక్తిగా మనం ఏంటీ అనేది నిర్ణయిస్తాయి.ఈ విషయం మా అమ్మ ద్వార చిన్నప్పటి నుండీ నాకు అనేక సార్లు అనిపిస్తూ ఉన్నా, ఇప్పుడు మరింతగా విశ్లేషించే అనుభవం,అవకాశం దొరికింది కాబట్టి మరీ
స్పష్టంగా అనిపిస్తోంది.

మావయ్య-అత్తయ్య తో కలిసి ఉండే మేము వాళ్ళు తీర్ధ యాత్రలకి వెళ్ళడంతో మాకు సాయంగా,బాబు ని చూసుకోడానికి అని ఊరి నుండి అమ్మ వచ్చింది.ఉన్నది 10 రోజులే, కాని తన చేతల ద్వార నాకు ఎన్నో పాఠాలు నెర్పింది.అమ్మ ఎప్పుడు వచ్చినా నీను ఇలా తన ద్వార ప్రేరణ పొందుతూనే ఉంటాను.బాల్యం నుండి అనేక విషయాల్లో పొందుతూనే ఉన్నాను.

గృహిణులలో చాలా మంది – 2 వర్గాలు ఉంటారు. కొంత మంది తము పుట్టిందే పని కోసం అన్నట్టు ఎప్పుడూ వంటింటికి అంకితం అయి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు.వీరికి సరిగ్గా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినే అవకాశం కూడా దొరకదు,అసలు వాళ్ళకు తినే హక్కు కూడా లేదేమో అన్నట్టు ప్రవర్తిస్తారు.ఇక రెండో వర్గం వాళ్ళు-వీళ్ళకి సరదాలు,సోకులు తప్ప ఇంటి గురించి పెద్దగా పట్టదు.మంచిగా వండటం,ఇల్లు చక్కగా పెట్టుకోవడం లాంటివి లెక్క చేయరు.వీళ్ళూ ఎప్పుడు బిజీగానే ఉంటారు.మా బంధు వర్గంలోనే చాల మంది ఈ రెండు కోవల్లో ఏదో ఒక దానిలోకి వస్తారు. కాని అమ్మ ఇల్లు చక్కపెట్టుకుంటూనే,రుచిగా వండుతుంది,అందరితో కలిసి తృప్తిగా తింటుంది.ఇతరులతో పంచుకోవడంలో (అది మనకున్న వస్తువులు కాని,మనసులో భావాలు,అనుభూతులు కాని) ఉన్న తృప్తి,ఆనందం కుటుంబ జీవితంలోనే నేర్చుకోవాలి,పిల్లలకి నేర్పాలి అని అంటుంది.రోజు మనం చేసే పని ఎలా అయినా
ఐపోతుంది-కాని దీన్ని మెరుగ్గా చేయాలి అనుకోవడంలోనే మన నైపుణ్యం ఉంది.ఎగ్జాం లో ఫస్ట్ రావడం,ఆఫీస్ లో ప్రమోషన్ రావడం…ఇలాటి పెద్ద విజయాలే కాకుండా,మన చేతల ద్వారా పొందే అదనపు ఆనందం,తృప్తి మనకి కుటుంబ జీవితంలో కూడా నూతన చైతన్యాన్ని ఇస్తుంది అనిపిస్తుంది అమ్మని చూస్తే.

చాల చిన్ని సూచనలే కాని దైనందిన జీవితంలో ఎలా నేర్పుగా,సుఖంగా ఉండొచ్చొ చెప్పడనికి కొన్ని ఉదాహరణలు..

మా వంటింటి కిటికీ ద్వార పావురాలు వచ్చి చాల చిరాకు చేస్తాయి,అసలే కోపం ఎక్కువ అయిన మా మావ గారు, ఆయన పూజ చేసుకుంటు ఉంటే అవి వస్తే, ఇంక ఇంట్లో అందరి పని అయినట్టే.వాటిని తరమడం, మరలా రావడం….అమ్మ అంది-ఈ కీటికి కి మెస్స్ కొట్టిస్తే లోపలికి రావు కదా,ఎందుకు ఇన్ని అవస్థలు పడతారు అని.ఇంత చిన్న విషయం మాకు ఇన్నాళ్ళు తట్టనే లేదు.

సాధరణంగా మిగిలిన కూరలు,తిండి పదార్ధాలు,స్వీట్స్ ఫ్రిజ్ లోకి తోసేస్తూ ఉంటం, మనం అవి తర్వాత తినం అని తెలిసినా సరే-అలా వారమో,నెలో గడిచాక పడెస్తాము. అమ్మ మిగిలిన పధార్దాలను ఎమి చెయ్యాలో వెంటనె నిర్ణయిస్తుంది.మద్యహ్నం ముద్ద పప్పు మిగిలితే దాన్ని రాత్రికి కాస్త తాళింపు పెట్టేసి వేడిగా తినేట్టు చేయటమో,మిక్చర్ లాంటివి అయితే ఉల్లిపాయ ముక్కలు,నిమ్మ రసం,కొత్తిమీరా జోడించి సాయంత్రం అల్పాహారంగా తయారు చేయడమో…ఇలా ఏమి చేయలేనివి,మనకు మొహం మొత్తి వదిలేసిన స్వీట్స్ బాపతు అయితే వెంటనే (అవి ఇంకా
తాజా గా ఉన్నపుడే) పని మనిషి కి ఇచ్చేయడమొ చేస్తుంది.ఇవి చాల చిన్న పనులు,కాని దీని వల్ల మనకు ఆహారం వ్యర్ధం చేస్తున్నం అన్న భావం కలగదు,అనవసరంగా పడెస్తున్నామే,కనీసం ఎవరికయినా ఇచ్చినా బాగుండేది అని తర్వాత పశ్చాత్తపం పడే అవసరం రాదు.

అలాగే నాది,మా వారిది,బాబు ది బట్టల అరలు సద్ది అక్కర్లేని బట్టలన్ని (అంటే అటు ఆఫీసుకి, ఇటు ఇంట్లో వేసుకోడానికి మనసొప్పనివి-ఎప్పటికి అలాగే మడతలుగా మిగిలిపోయేవి) తీసి పక్కన పెట్టింది. తను ఊరుకి వెళ్ళేప్పుడు అవన్ని తీసుకెళ్ళి క్కడ మాకు తెలిసిన వాళ్ళ లోనే కాలేజీలకి వెళ్ళే పేద విధ్యార్ధులకి,పిల్లలకి పంచుతా అని పెట్టింది.దీని వల్ల మన బట్టల అరల్లో జాగ దొరకడమే కాక,వేరే వాళ్ళకి మనం తీసేసినవి పనికి వస్తాయి…కాని ఇలా పని గట్టుకుని అన్ని బట్టలు మోసుకెల్లి మరీ పంచడం అమ్మకే చెల్లింది.’నేను కొని ఇవ్వలేక పోయినా ఇలా అయినా చెయ్యొచ్చు కదా’ అంటుంది.

మంచి నీళ్ళు కింద నుండి పైకి పని అమ్మాయి మోసుకుని వస్తుంది.ఒక రోజు అమ్మాయి రాకపోయినా,మాకు ఇంకొక బిందెడు నీళ్ళు అవసరం అయినా ఇబ్బందే.మా ఇంట్లో బోర్వెల్ నీళ్ళు కూడా బానే ఉంటాయి.ప్యూరిట్ లాంటి పరికరం కొనుక్కుంటే ఈ బోర్
వాటర్ నే తాగడానికి వాడొచ్చు కదా అంది అమ్మ.నిజంగానే నాకైతే ఈ ఆలొచన తట్టలేదు.

మా పనమ్మాయి కూడా-మీరు ఉంటే గిన్నెలు చాల తక్కువ పడుతున్నాయమ్మా అంది.దీనికి కారణం తను వంట చేసే విధానం ఒకటైతే,పెద్దగా మైల పడని పాత్రలను అప్పుడే కడిగేసుకుంటుంది కూరలు తరగడానికి మాత్రమే వాడిన
పళ్ళెం,పాలు తొరపడానికి వాడిన గ్లాస్,ఐస్క్రీం లాంటివి తిన్న కప్,స్పూన్ లాటివి- ఇవి అప్పటికి అప్పుడు కడగటం చాల సులువు,ఎండితే పెద్ద పని,బోలెడు నీళ్ళు దండుగ.

ఆఫీస్ అయిపోయాక ఇంటికి అలసటగా చేరుకోవడం,మొక్కుబడిగా ఇంట్లో పనులు ముగించడం,దేనికి టైం ఉండటంలేదు అని బాధ పడటం…..అమ్మని చూస్తే అనిపిస్తుంది-జీవితంలో ఆఫీసు,ఇల్లు అనేవి రెండు విభిన్న ద్రువాలు కాదు,ఒకదాని కోసం ఒకటి త్యాగం చెయక్కర్లేదు.మన జీవన విధానంలో నాణ్యతను బట్టే మన సంతోషం,మనశ్శాంతి అన్నీ ఆధార పడతాయి.నాణ్యత అంటే-మేలైన బట్టలు కట్టుకుని,మంచి ఇంట్లో బతుకుతూ,కార్లో తిరుగుతూ ఉండటం కాదు-చేసే ప్రతి పనిని ఆస్వాదించడం,ఉన్నంతలో మన పక్క వారికి సాయం చేయడం..దానికి అణుగుణంగా మన దైనందిన జీవితాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకుంటూ వెళ్ళడం.ఇన్ని మాటలు ఇంత వివరంగా చెప్పడనికి అమ్మ పెద్దగా చదువుకోలేదు,గొప్పగా మాట్లడలేదు కాని,వాటి కంటే విలువయిన చేతలు ద్వార చూపిస్తుంది.

ప్రకటనలు

5 వ్యాఖ్యలు to “అమ్మ నేర్పిన చిన్ని ఆనందాలు..”

 1. Partha Sarathi Says:

  Heart touching message. Every one should read it.

 2. Saraswathi Kumar Says:

  జీవించడం ఒక కళ. ఆ కళలో మీ అమ్మ గారు నిష్ణాతులని అనిపిస్తున్నది. ఈ కళ తెలియని వారు అనేకమంది ఆనందం ఎక్కడో ఉందని వెర్రి ప్రయాసలు పడుతూ విఫలయత్నాలు చేస్తుంటారు. ఆనందం మన చెంతనే ఉందనే ఉందనే విషయం గుర్తించిన మీ అమ్మ గారి లాంటి వారు లోకంలో చాలా అరుదుగా ఉంటారు. భగవద్గీతలో నిత్యసంతుష్టత,యదృచ్ఛాలాభ సంతుష్టత లాంటి కొన్ని ఉన్నత మానసిక స్థితులు చెప్ప బడ్డాయి. అవి ఏ యోగుల లోనో మాత్రమే ఉంటాయనుకుంటే పొరపాటే. మీ అమ్మ గారి మనస్సు అలాంటిదే.

  ఏదో లేదని బాధ పడటం కన్నా, ఇతరులను చూచి అసూయ పడుతూ జీవితాన్ని తుచ్ఛం గా గడపటం కన్నా మనకందు బాటులో ఉన్న మనదైన జీవితాన్నే అందంగా, ఆనందంగా మలచుకోవటానికి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి. అది మీ అమ్మ గారిలో పుష్కలంగా ఉన్నది. మీ అమ్మగారు పెద్దగా చదువుకోలేదని రాశారు. కానీ ఎంతో మంది చదువుకున్న వారికన్నా మీ అమ్మ గారు చాలా ఎత్తులో ఉన్నారు.
  మీ అమ్మ గారిలా జీవితంలో ఆనందాన్ని సాధించటం ఎవరికైనా సులభమే. కానీ ఆ స్పృహ కలగటమే చాలా కష్టం. మీకు కలిగి నందుకు అభినందనలు.

 3. radhika Says:

  చాలా చిన్ని చిన్ని విషయాలు మన అలసత్వం వల్ల,బద్దకం వల్ల బూతద్దం లో కనపడుతూ వుంటాయి.ఒక్క నిమిషపు ఆలోచనతో,ఆచరణ తో అవి పరిష్కరింపబడతాయని మీ అమ్మగారు చేతల ద్వారా చూపించారు.మీరు నేర్చుకున్న విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.

 4. prasanthi Says:

  Very very nice article. It is very true. We can live each and every moment and in those moments we can let others also live with same vigour and enthusiasm. Life is there to be cherished.

 5. sankar Says:

  ma amma kuda ilane chestundi very very very nice article

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: