శాస్త్రవేత్తలకు మనవి…

మన నిత్య జీవితంలో రోజు రోజుకి పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం చూస్తుంటే…మానవుడు చెయ్యలేనిది ఏదీ లేదేమో కదా అనిపించక మానదు.ఒక 100 ఏళ్ళ క్రితం ఇవన్నీ అభూత కల్పనలు అనుకునేవన్నీ ఇపుడు మనం చూస్తున్నాం. అలా నాకూ కొన్నీ అభూత కల్పనలు ఉన్నాయి.అంటే ఏ శాస్త్ర వేత్త అయినా వీటిని కనిపెడితే బాగున్ను అనిపించే అంశాలు….ఎవరైనా యువ శాస్త్రవేత్తలకు నా ఈ కోరికలను పరిశోధన కు పంపించమని మనవి.

జాబితా-1:

 • నాకు లిఫ్ట్ ఎక్కి పై అంతస్థు నుండి కింది అంతస్థు కి క్షణాల్లో చేరుకున్న ప్రతి సారి అనిపిస్తూ ఉంటుంది…ఎప్పటికైనా అధునాతన టెక్నాలజీ వచ్చి మనిషి ఒక చాంబర్ లాంటి దానిలోకి వెల్లి కొన్ని మీటలు నొక్కేస్తే ఆఫీస్ నుండి డైరెక్ట్ గా ఇంటికి వెల్లిపోయేలా ఉంటే ఎంత బాగున్ను అని (అంటే కేవలం కొన్ని క్షణల్లో మత్రమే 10 కి.మి దూరంలో ఉన్న మా ఇంటికి చేరిపోయేలా)…ఈ ఆలోచనకు ఇంకొంత పొడిగింపు, బహుశా ఇప్పటికి ఇది అభూత కల్పన కావొచ్చు….ఇలాగె చక్కగా మా ఊరు వెల్లిపోయే సదుపాయం ఉంటే? అపుడు ఈ కాంక్రీట్ అరణ్యంలో ఒక ఇల్లు కొనుక్కోవాలనే ఆలోచన ఉండదు, దాని కోసం అని డబ్బులు కూడబెట్టుకునే అవసరం ఉండదు…చక్కగా మా ఊర్లో పచ్చని పరిసరాల మద్యలో ఉండే పొదరిల్లు కు చేరిపోవచ్చు.అప్పుడు ఇక్కడ నగరాల్లో జనభా,కాలుష్యం లాంటివి పెరిగిపోవు.
 • అలాగె ట్రాఫిక్ జాం లో ఇరుక్కుపోయిన ప్రతీ సారి….సినిమల్లో మనిషి చనిపోయాక ఆత్మ మనిషి నుండి విడిపడి స్వేచ్చగా ఎగిరిపోతుంది…అలా ఈ వాహనన్ని వదిలెసి స్వేచ్చగా ఎగిరిపోయి ఇంటికి చేరిపొవలి అనిపిస్తుంది…కనీసం ఇంటికి చేరకపోయినా ఆ జాం ఉన్నంత సేపు గాలిలో స్వేచ్చగా తిరిగేలా అవకాశం ఉన్నా చాలు…(హుం.ం..కాని ఇలాంటి పరికరం ఎమయిన వస్తే ట్రాఫిక్ జాం భూమి నుండి ఆకాశానికి చేరుతుంది..అంతే)
 • సెర్చ్ ఆప్షన్ కి బానిసలం అయిపోయిన మనం ఏదైనా వెతకాలి అంటె వెంటనే కంట్రోల్ ఫ్ కొట్టేస్తాం.దీనికి అలవాటు పడి నాకు నేనుగా ఏదయినా వెతకాలంటే చాలా చికాకు వచ్చేస్తుంది…ఇంట్లో ఏదయినా వస్తువు వెతకాల్సిన ప్రతి సారి సెర్చ్ ఆప్షన్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.(ఇది మాత్రం ఎంత త్వరగా వస్తే అంత మంచిది)
 • లోకంలో నీటి సమస్య ఎంతగా ఉన్నా..మన ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి కదా అని దర్జాగా కొలాయిలు వదిలేసి హాయిగా తమ పనులు చేసుకునే వాళ్ళ కోసం…ట్యాప్ ఓపెన్ చేసాక ఎటు వంటి వుపయోగం లేకుండా నీరు డ్రైనేజీకి చేరుతోంది అనే సెన్సార్ ప్రతి పైపు కి అమర్చే సదుపాయం ఉండి దానికి అదే ట్యాప్ బంధ్ అయిపోతే బాగున్ను (ఇది చాల చిన్న కోరికే కానీ…రాస్ట్రం అంతా, దేశం అంతా అమలు చేయాలంటే చాలా పెద్ద కోరిక,కాని వుపయోగం కూడా అంత పెద్దగానే ఉంటుంది..నాకు ట్యాప్ విప్పేసి పళ్ళు అద్దంలో చూసుకుంటూ గంటల కొద్దీ బ్రష్ చేసుకునే వాళ్ళని చూస్తే మహా మంట!అలా ఎవరు చెయ్యడం చూసినా వెంటనే వెళ్ళి ట్యాప్ ఆపేస్తాను-కావలిస్తే మరలా విప్పుకో అని చెప్పి)
 • మన జీవితంలో మధుర క్షణాలను ఫొటోల్లో బంధించి జీవితాంతం వాటిని చూసుకుంటు ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటాం. కానీ ఆ ఫోటో లో, వీడియో లో లా సంఘటన జరిగేపుడు ఎలా మనం ఫీల్ అవుతున్నామో ఆ అనుభూతిని కూడా బధ్ర పరుచుకునె వీలు ఉంటె ఎంత బాగుంటుంది.ఇది ఖచ్చితంగా సాద్యం కాదు కానీ…ఇలా చెయ్యగలిగితే ఇక గతం అంటూ ఏమి ఉండదు. అన్నీ ఎప్పటికీ తాజాగానె ఉంటాయి

జాబితా-2:
శాస్త్రవేత్తలు ఎప్పటికీ కనిపెట్టకూడదు అనుకునేవి కూడా కొన్ని ఉన్నాయి.అవి ఈ జాబితాలో..

 • మన ఆలోచనలను ఎదుటి వాడు పసిగట్టేసే పరికరం చచ్చినా రాకూడదు. ఒకోసరి పబ్లిక్ ప్లేస్లలో ఉండగా ఏదయినా చెత్త ఆలోచన వస్తే…హమ్మయ్య..దేవుడు ఆలొచనలను పూర్తిగ మనకె సొంతం చేసాడు కాబట్టి నిర్భయంగా ఏమయినా ఆలోచించుకోవచ్చు.. నా ఇస్టం అని భరోసా ఉంటుంది..కాబట్టి ఆలోచనలను పసిగట్టే పరికరం మత్రం ఎప్పటికీ రాకూడదు
 • పాపిన్స్/చాక్లెట్ ల లో రక రకాల ఫ్లేవర్స్ తో అవి తింటే అచ్చం ఆయా పదార్ధం తిన్నట్టే ఉండేలా ఇప్పటికే చాల వచ్చాయి (కాఫీ బిళ్ళలు, నారింజ బిళ్ళలు ఇలా). ఇది మరింత పెరిగి బొబ్బట్టు బిళ్ళ,లడ్డు బిళ్ళ,జిలేబి బిళ్ళ ఇలా మన తిండి పదార్ధాలకు ఎసరుపేట్టే బిళ్ళలు అస్సలు రాకూడదు. ఎందుకంటే ఈ పిండి వంటలను ఆయా రూపల్లో,రంగుల్లో తినడంలో ఉండే తృప్తి కేవలం వాటి రుచి అనుభవించినంత మాత్రాన రాదు.
 • ఫోన్ టెక్నాలజీలో రాను రాను వచ్చే మార్పులు చూస్తుంటె భయం వేస్తోంది…ఎప్పటికైనా..మనం ఫోన్ మాట్లాడెపుడు ఎలా ఉన్నామో అవతలి వాడికి కనపడే అవకాశం (మన ప్రమేయం లేకుండా) మాత్రం రాకూడదు. ఏ స్నానం చేస్తూనో, ఇంకేదో చేస్తునో ఫోన్ మాట్లాడుకునె సౌకర్యం ఇపుడు ఉంది. అది గాని వస్తే ఏ ఫోన్ కాల్ వచ్చినా మన ఇంటికి ఎవరయినా వస్తే ఎలా తయారవుతామో అలా ఉండి తీరాలి.ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయిలు తన కాబోయె భర్తతో/బోయ్ ఫ్రెండ్ తో మాట్లాడేప్పుడు పాపం మొహానికి ఏవో పూసుకుని, తలకి హెన్నాలు పెట్టుకుని చాలా అసహ్యంగా ఉంటారు చాలా సార్లు…అవతలి వాళ్ళకి ఇలా కనిపిస్తే అంతే సంగతులు ఇంక.
 • తిరుపతి దేవస్థానం లో అధునాతన తెక్నాలజీ ఎప్పటికి అప్పుడు అమలు చేస్తూ ఉంటారు (సుదర్శన్ కంకణాలు, ఆన్ లైన్ సేవలు ఇలా…).కాని జనం రద్ధీ రాను రాను పెరిగినా సరే దేవస్థానం వారు ఈ ఆలొచన ఎప్పటికి చేయకూడదు.అదెంటంటే…ప్రతి భక్తుడికి ఒక ఇడెంటిటీ ఇచ్చేసి(ఉదాహరణకు-భక్తా ఐ డి 1346) ప్రతి భక్తుడు తిరుమలను ఎన్ని సార్లు దర్శించాడో, మర్లా ఎప్పుడు దర్శించే అవకాశం కలుగుతుందో సూచనలు చెయ్యడం. అంటే ఫలానా భక్తుడు ఏప్రిల్ 2007 లో శ్రీవారిని దర్శించాడు కబట్టి మరలా 2010 వరకు అతనికి చాన్స్ లేదు అని చెప్పడం.ఇది గాని వస్తే పెళ్ళి బట్టలతో శ్రీవరిని దర్శించుకుంటా, మా బాబు కి అన్న ప్రాశన తిరుమల లో చేస్తా లాంటి మనం బాగా అలవాటు పడిపోయిన మొక్కులు ఇంక మొక్కుకోలెము.

మరల ఆలొచిస్తే మొదటి జాబితాలోని ఆఖరి కోరిక అక్కడ కాకుండ ఇక్కడ చేర్చాలేమో అనిపిస్తోంది…

ప్రకటనలు

9 వ్యాఖ్యలు to “శాస్త్రవేత్తలకు మనవి…”

 1. chavakiran Says:

  baagunnaayi

 2. swathi Says:

  భలే ఉన్నాయి మీ కోరికలు. చాలా వరకు న్యాయమైనవే.

 3. వీవెన్ Says:

  బాగున్నాయి!

  భవిష్యత్తులో ఆఫీసు పని ఇంటినుండి చేసే వీలుకలుగుతుంది.

  అటో-ట్యాపులు (మరకుళాయిలు అందామా) ఈపాటికే కొన్ని చోట్ల (టాయిలెట్లు, మొ.వి.) వాడుతున్నారు కూడా.

  మీ తిరుపతి భయం నిజమయే సూచనలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తుంది.

 4. ప్రసాద్ Says:

  మీ ఆలోచనలు ఆలోచించింపజేసేలా వున్నాయి.
  ముఖ్యంగా కుళాయి తిప్పి షేవ్ చేసుకునే, పళ్ళు తోముకునే విషయం. ప్రతిరోజూ నాకు గుర్తుకొస్తుంది నీళ్ళు వృధా అయిపోతున్నాయని. వెంటనే ఒక్కోరోజు కుళాయి కట్టేస్తాను, ఒక్కోరోజు నా అంతరాత్మను కట్టేస్తాను.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 5. ప్రవీణ్ గార్లపాటి Says:

  హహహ…
  భలే ఉన్నాయి మీ కోరికలు. ఏమో తొందరలోనే ఎన్నో కొన్ని నిజమయ్యే అవకాశం ఉంది.

  వీవెన్ గారూ ఇప్పటికే work from home లు ఉన్నాయిగా ?

 6. radhika Says:

  చాలా బాగున్నాయి మీకోరికలు.కుళాయీల విషయం లో అది సాధించేసారుగా.మన మన ఇళ్ళల్లో వాటిని పెట్టించుకోవడమే తరువాయి.ఒక చోటునుండి మరొక చోటుకి మీటలు నొక్కగానే వెళ్ళే చాన్స్ వుంటే ఇంక ట్రాఫిక్ జాం ఎందుకుంటుందిలెండి.మీ మొదటి కోరిక తీరితే రెందొ కోరికను మూలకు నెట్టేయొచ్చు.

 7. నాగరాజా Says:

  బాగుంది మీ లిస్టు!

 8. apple Says:

  nenu ippude chadivanu.chala baga vrasaru

 9. CassAmino Says:

  హాయ్ అభిరామ్, మీకు వున్న తెలుగు భాషాభిమానానికి జోహార్లు. ఇంటెర్నెట్ లో ఇంత స్వచ్ఛంగా తెలుగును చూస్తుంటే ఆనందంగా వుంది మీ లాంటి తెలుగు భాషాబిమానులకు ఒక చిన్న ఐడియా ను నేను ప్రారంభించాను. అదే http://www.atuitu.com మిమ్మల్ని ఇక్కడకు ఆహ్వానిస్తున్నాను.

  Atuitu is exclusively for Telugu People to help them stay connected and express their voice with some unique tools. I look forward to your contribution on atuitu through active participation and your valuable feedback.

  Cheers

  cass

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: