పసితనం..

చిన్నప్పుడు చదువుకున్న జాషువా గారి “శిశువు” అనే కవితలో పసి పాపలను బొటనవేలు నోట్లో పెట్టుకున్న ముని అని పోలుస్తాడు.అప్పట్లో అంత లోతుగా ఆలోచించలేదు కాని, ఇప్పుడు చిన్నారి బాబు కి తల్లిగా అతి సన్నిహితంగా పసివాడితో గడపడంవలన కలిగిన భావాలు…

నిజంగానె మనిషిని దేవుడే సృష్టిస్తాడు అనడానికి ఋజువు పసితనం
దేవుడు మనిషిని ఇంత అందంగ,స్వచ్చంగా,మనోహరంగా సృష్టిస్తాడా…

బేల కళ్ళు
కల్మషం లేని నవ్వు
అమాయకంగా చూసే చూపులు
ఆనందానికి అంతు లేని కేరింతలు!
ఏదొ తెలుసుకోవాలనే కుతుహులం
ప్రతీది సాధించాలనే తపన!

బోర్ల పడటం,పాకటం,నడవటం…
ఎంత కృషి ఉంటుంది ప్రతి దశలో

చీకు చింతా లేకుండా నిదురించే ఆ మోములో
ఎంత హాయి ఉంటుంది..

చిన్న చీమనైనా చూసి మురిసిపోటంలో
ఎంత తృప్తి ఉంటుంది…

హాయిగా ఎడ్చేయటానికి, బిగ్గరగా అరవటానికి
ఎంత స్వేచ్చ ఉంటుంది…

మొహమాటం ఉండదు
కావల్సినది అడగటానికి
తీరిక ఉండదు ఏదయినా ఆలోచించడానికి

దేని మీద కోరిక ఉండదు కుతుహులం తప్ప
దేనికి విలువ ఉండదు తన ఉనికి కి తప్ప!

ఇలాంటి ఎమి పట్టని,ఎమి అక్కరలేని స్థితి నుండి ఎదిగి అన్ని నావేగా జీవించి,చివరకి ఏమి పట్టుకెల్లలేని దశ కి చేరుకుంటాం….ముసలి వాల్లనే కాదు,పసి పిల్లలని చూసినా వైరాగ్య భావన కలుగుతోంది నాలొ…
 

ప్రకటనలు

5 వ్యాఖ్యలు to “పసితనం..”

 1. T.Bala Subrahmanyam Says:

  Time and matter created mind. Mind created difference. Difference created conflict. Conflict undid God’s original creation of innocence. When a child cries, it is not his mind that cries, but his body only. But when we cry, it is our mind that cries, but not our body. As we advance in age, we increasingly tend to become more and more mental beings than physical entities that we were created to be originally. So, when a child has to suffer, he just suffers. But we adults suffer more in anticipation of suffering.

 2. ప్రసాద్ Says:

  బాగా చెప్పారు. పసితనం అంత మధురమైంది ఇంకేదీ లేదనిపిస్తుంది.
  మాతృత్వం పిల్లలతో గడపడం అంత ఆనందానుభూతి ఇంకేం వుంటుంది.
  నేను నా పిల్లలతో ఆడుతున్నంత సేపు వాళ్ళకంటె చిన్నవాన్నైపోతా!

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. సిరిసిరిమువ్వ Says:

  చాలా బాగా చెప్పారు. రాగద్వేషాలకి, ఈసునసూయలకి అతీతమైన బాల్యం నిజంగా ఓ గొప్ప సృష్టి.

 4. radhika Says:

  బాల్యం మనకు గుర్తు వుండకపోవచ్చు.కానీ బాల్యం అన్న పదం తలచినా,మన పిల్లలని చూసినా అదేదో భావనకు లోనయిపోతాను నేను. మనుషులు ఎదుగుతూ మనసులు అలా పసి ప్రాయం లోనే వుండిపోతే ఎలావుంటుంది.

 5. swathi Says:

  ఎందుకో మనసుని తాకింది. బహుశా నేనూ మీలాంటి దశ లోనే ఉండటం వల్లేమో.
  కాని పసితనం నుంచి నేర్చుకోవాల్సిన వేదాంతం ఎంత సింపుల్ గా చెప్పారు.
  చదివాక చాలా అలోచన లో పడ్డా!
  ఈ Transparency, simplicity జీవితం్ లో యే దశ లో ఐనా చాలా మనశ్శాంతినిస్తాయి.
  మీతో సాన్నిహిత్యం వల్ల ఈ విషయం మాత్రం నేనెప్పటికప్పుడు నేర్చుకుంటున్నా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: