టైప్ మిషన్…

నిన్న ఏవో లీగల్ డాకుమెంట్స్ టైప్ చేయించాల్సి వచ్చింది. కంప్యూటర్ లో టైప్ చేయ్యడం అలవాటైన మనకి ఇప్పుడు టైప్ మిషన్ చూస్తే కాస్త చిత్రంగానే ఉంటుంది.ఎప్పుడో 10 ఏళ్ళు క్రితం వదిలేసిన/దూరం అయిన మిత్రుడు ఇప్పుడు కలిస్తే ఎన్ని భావాలు కలుగుతాయో అన్ని భావాలు కలిగాయి….టైప్ మిషన్ లో టైప్ చేయడం చూస్తుంటే.

అసలు టైప్ కొట్టే మనిషిని వెతికి పట్టుకోవడమే తప్పి పోయిన మిత్రుడి జాడ తెలుసుకున్నంత కస్టం అయింది మాకు. 3-4 చోట్ల టైప్ ఇన్స్టిట్యూట్ అని బోర్డ్ ఐతే ఉంది కాని, తీరా చూస్తే లోపల మిత్రుడు లేడు, ఇల్లు కాలి చేసెసాడట…డీ.టీ.పి అనే కొత్తాయనకి అప్ప చెప్పేసి.
అవసరం పడింది, ఎక్కడున్న పట్టుకు తీరాలి కాబట్టి, పట్టుదలగా వెతగ్గా, వెతగ్గా….ఒక చోట ఇంకా నా మిత్రుడు కొంత మందికి ఆశ్రయం ఇస్తూ కనిపించాడు.గడ్డం మాసి పోయి, పెళ్ళి కావల్సిన ఆడ పిల్ల ల తండ్రిలా ఉన్న ఒక పెద్దాయన కళ్ళ జోడు సరి చేసుకుంటూ టక టకా టైప్ కొడుతూ కనిపించాడు.
పక్కనే ఉద్యోగ వేట తో అలసి పోయి, బతుకు తెరువు కోసం ఈ ఉపాధి ని ఆశ్రయించిన ముదురు పట్టభధ్రుడు ఒకతను ఈ టైపింగ్ పనిలో మునిగి పోయి ఉన్నాడు.
మా డాక్యుమెంట్లు టైప్ చేయమని రెండో వ్యక్తి దగ్గర ఇచ్చి, చాల రోజులైంది టైప్ చేసి, చేయడం చూసి అని వెళ్ళి  పక్కన కుర్చీ లాక్కుని కుర్చున్నాను.
టైప్ చెయ్యడం మొదలెట్టాడు. ఒక్కో అక్షరం పేపర్ మీద పడుతుంటే…కంప్యూటర్ లో టైపింగ్ తల్చుకుని, నాకు బ్లేక్ అండ్ వైట్ సినిమా కి ఇప్పటి మన సినిమాలకి ఉన్నంత తేడ గా అనిపించింది.ఒక లైన్ టైప్ చేసి తర్వాతి లైన్ కి వెళ్ళాలి అంటే ఎడమ చేతి వైపు ఉండే స్క్రోల్ల్ బార్ ని ప్రతీ సారి లాగాలి.
ఏదయినా అక్షరం తప్పు కొడితే డిలీట్ చేసే అవకాశం లేదు.
అండర్ లైన్ చెయ్యాలి అంటే ఎంత పొడుగు గీత గియ్యలో అన్ని సార్లూ టక టక ఆ కీ ని కొట్టాలి.ఒకో సారి హడావిడిగా కొడుతూ ఉంటే రెండేసి అక్షరాలు, అవి అచ్చు చేసే చోట స్ట్రక్ అయిపోతాయి.మర్లా చేతితో వాటిని విడ దీయాలి.గట్టిగా 30 లైన్లు టైప్ చేసేప్పటికి పేపర్ అయిపోతుంది. మరలా పేపర్ మార్చాలి,కార్బన్ పెట్టలి, ఆ పేపర్ ని ఎక్కించి అప్పుడు మొదలెట్టాలి.
అన్నిటి కంటే పెద్ద తల నొప్పి, మనం ఇచ్చిన స్క్రిప్ట్ అర్ధం చేసుకోవడం. సాధారణంగా డాక్టర్లు, లాయర్లు రాసే లిపి ఒక పట్టాన అర్ధం కాదు. బ్రహ్మ రాత లాంటి ఆ లిపి ని అర్ధం చేసుకుని,ఫాస్ట్ మెయింటైన్ చేస్తు కొట్టడమే టైపింగ్ లో ముఖ్యమైన పని.
ఇలా మొత్తం 5 పేజీలు కొట్టడానికి సుమారు 25 నిమిషాలు పట్టింది.పాపం ఇలా ఎంత కస్ట పడితే వీళ్ళకి ఎంత వస్తుందో కదా అని జాలి పడె లోపు ఆయన చెప్పిన ఫీజ్ విన్నాకా పర్లేదు ఖచ్చితంగా నా పాత మిత్రుడు కుటుంబాన్ని పోషించే సంపాదని కల్పిస్తాడు అనిపించింది.పేజీకి 10/- చొప్పునా 50/- తీసుకున్నారు. ఈ లెక్కన ఆ సెంటర్ లో రోజుకి 10-15 మంది మా లాంటి వాళ్ళు వచ్చినా 500 కనీసం గిట్టుబాటు అవుతుంది.

నేను పదవ తరగై చదివే రోజుల్లో 10 పాస్ అయిన ప్రతి వాళ్ళూ టైపింగ్ నేర్చుకునే వాళ్ళు. అప్పట్ళో మా అమ్మ పట్టు బట్టి మరీ నాకూ టైప్ నేర్పించింది.అలా హయ్యర్ పాస్ అయ్యాను.టైపింగ్ ఉపాది కల్పిస్తుంది అంటే…నేను చిన్న చూపు చూసాను…ఆ రోజుల్లో ఏమో కానీ…ఇప్పుడు టైప్ చేసే వాళ్ళు తక్కువ అయిపోయి నిజంగానె దాన్నీ నమ్ముకుని బతికే వాళ్ళకు అన్యాయం చేయకుండా ఉపాది కల్పిస్తోంది. అప్పట్లో టైప్ మిషన్ మీద నేను పడిన కుస్తీలు గుర్తొచ్చాయి. స్క్రిప్ట్ టెస్ట్ అని అంత చెత్తలా ఉండే వ్రాతని పరిక్ష కోసం ఎందుకు ఇస్తారో అప్పట్లో పెద్ద తెలియలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది…అందుకేనా మా టైప్ మాస్టారు అంత అర్ధం కాని చెత్త రాతని మా చేత కొట్టించే వారు అని. ఎప్పుదో దాదాపు 10 ఏళ్ళు కింద నేర్చుకుని వదిలేసిన టైప్ మిషన్ ని చూడ గానే…ఏవొ జ్ఞాపకాలు కదిలి ఈ బ్లాగ్ రాయడానికి ప్రేరేపించింది.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు to “టైప్ మిషన్…”

 1. సుధాకర్(శోధన) Says:

  నేనైతే పరీక్షలకు వెళ్లలేదు గానీ, సరదాగా టైపు నేర్చుకున్నా…భలే సరదాగా వుండేది. మిత్రులతో కబుర్లూ అక్కడే…అదొక టైపు రచ్చబండ 🙂

 2. radhika Says:

  అప్పట్లో టైపు నేర్చుకోని వాళ్ళు,ఇప్పట్లో క్రాష్ కోర్సులు చేయని వాళ్ళు చాలా అరుదు.ఈ కంప్యూటర్లు పోయి మల్లా ఏమి వస్తాయో?

 3. Jaya Prakash Says:

  బాగీ పాంట్లు పొయ్యి బెల్‌బాటంలు వచ్చినట్టు,
  మల్ల కంప్యూటర్లు పొయ్యి టైప్‌రైటర్ లు వస్తయి లేండి !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: