నమ్మ లేని నిజాలు

పోయిన వారాంతం లో “అన్ బిలీవబుల్ ఫాక్ట్స్” అని ఒక పుస్తకం చదివాను…వాటిలో కొన్ని నమ్మ లేని నిజాలు మీ కోసం…

 • బొద్దింక తల లేకుండా వారం రోజులు బతక గలదట.
 • భూమి పుట్టినప్పటి నుండి, ఇప్పటి వరకు వున్న కాలాన్ని ఒక సంవత్సరం అనుకుంటే, మనిషి పుట్టింది డిసెంబర్ 31,రాత్రి 8.30 కట.
 • భూమి గుండ్రంగా లేదు, బల్ల పరుపుగా ఉంది అని నమ్మి, వాదించే వాళ్ళు..ఒక 18 ఏళ్ళ ముందు వరకు బతికే ఉన్నారట.
 • మన మెదడు నిద్ర పోయెప్పడు, టీ వీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట.
 • ప్రపంచం మొత్తంలో ఒక రోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత ఉంటుందట (ఇక్కడ అన్నం పరిమాణం కన్నా, ఈజిప్ట్ పిరమిడ్ అంత పెద్దగా ఉంటుందా అని అశ్చర్యపోయాను)
 • సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్ధం అట. కానీ అక్కడ ఒక్క సిం హం కూడా ఉండదట.అన్నట్టు సింగపూర్ లో చ్యు యింగ్ గం తినడం నేరమట (వివిద దేశాలలో ఇలాంటి వింత నేరాల లిస్ట్ చాలానే వుంది. మన దేశం లో చాలా బెట్టర్ అనిపించింది)
 • 3 వేల మైళ్ళకి పైనే వున్న చైనా గోడ మనం అంతరిక్షంలోకి వెళ్ళినా భూమి పైన గుర్తు పట్టెలా ఉంటుందట.అసలు ఎన్నో వేల జీవితాలు, ఆ గోడ మీదనే పుట్టి, పెరిగి, దాన్నే కాపలా కాసి, అక్కడే అంతం అయిపోయాయట. అంటే వాళ్ళ జీవితం కేవలం ఆ గోడకే అంకితం.
 • రోదసిలో ఉన్న వ్యొమగాములు ఏడవలేరట. వాళ్ళకి గురుత్వాకర్షణ లేక అసలు కన్నీళ్ళు రావట.అలాగే వ్యోమగామి గుండె సంకుచించి పరిమాణం చిన్నది అవుతుందట.
 • మన జీవిత కాలంలో మనం 3 ఏనుగులు బరువు వున్న అన్నం తింటామట.
 • ఆకాశంలో చుక్కలన్నీ లెక్క పెట్టడానికి…సెకనుకి ఒకటి చొప్పునా లెక్క పెట్టినా…3000 ఏళ్ళు పడుతుందట.
 • ఇతర గ్రహ వాసులు తినేస్తారని, వాళ్ళ నుండి కాపాడుకోవాలని 25% అమెరికన్ లు ఇన్సూరెన్స్ చేయించుకుంటారట.90% అమెరికన్లు నాకు బిడియం ఎక్కువ అని అనుకొంటారట, 60% పైనే దెయ్యాలు వున్నాయని నమ్ముతారట.
ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “నమ్మ లేని నిజాలు”

 1. radhika Says:

  konni nammaleani nijaalea.

 2. Krishh Raem Says:

  “భూమి గుండ్రంగా లేదు, బల్ల పరుపుగా ఉంది అని నమ్మి, వాదించే వాళ్ళు..ఒక 18 ఏళ్ళ ముందు వరకు బతికే ఉన్నారట.”

  ఇప్పటికీ ఉన్నారు http://www.theflatearthsociety.org/ 🙂

 3. ప్రసాద్ Says:

  నేను చెప్పాలనుకున్నది క్రిష్ చెప్పేశారు.
  “ఇతర గ్రహ వాసులు తినేస్తారని, వాళ్ళ నుండి కాపాడుకోవాలని 25% అమెరికన్ లు ఇన్సూరెన్స్ చేయించుకుంటారట.” ఇద్ది నేను నమ్మలేను.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. ప్రసాదం Says:

  “రోదసిలో ఉన్న వ్యొమగాములు ఏడవలేరట. వాళ్ళకి గురుత్వాకర్షణ లేక అసలు కన్నీళ్ళు రావట.”

  ఎంత మంచి వార్తో, ఆడాళ్ళనందరినీ అంతరిక్షంలోకి పంపితే సరి. ఇక కన్నీల్లు ఉండవ్. మగాళ్ళు ఏమంటారు? 🙂

 5. సత్యసాయి Says:

  ఇంతకు ముందటి వ్యాఖ్యలు- నా భావాలు కూడా ఇంచుమించు అవే. అవి కాక,
  బొద్దింక తల లేకుండా వారం రోజులు బతక గలదట – అదేం గొప్పకాదు చలామంది మనుషులు ఒక జీవితకాలం గడ్పేస్తున్నారు.

  మన మెదడు నిద్ర పోయెప్పడు, టీ వీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట. – అందుకే ఇడియట్ బాక్స్ అన్నారేమో!

 6. apple Says:

  edupulekapote elagandi tv serials anni tussss….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: