కంఫ్యూజన్..

చదువరి బ్లాగ్ లో రాసినట్టు…భాషా దోషాల లాగానే.. మన నిత్య జీవితంలో మనకి ఇంకా బోలెడన్ని కంఫ్యూజన్ లు ఉంటాయి.అవన్నీ మొదలెడితే పెద్ద బ్లాగే రాయొచ్చేమో..ఇంత వయసు వచ్చీ, ఇంత చిన్న విషయం లో కంఫ్యూజనా అని మనలో మనమే చింతించే బదులు ఇలా బ్లాగ్ లో నలుగురితో పంచుకుని హాయిగా నవ్వేసుకుని, మన లాగే ఇంకొంత మంది ప్రబుద్ధులు ఇదే తరహా లో వున్నారులే అని తృప్తి పడొచ్చు.

కుడికి, ఎడమకి తేడా తెలియని వాల్లు చిన్న పిల్లలే కాదు…పెద్ద వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.నా స్నేహితులలోనే ఒక 25% మంది ఉన్నారు.ఒక స్నేహితురాలు ఐతే…నాకు స్కూటీ ఉండేది, తనని కూడా నేర్చుకో, నేను నెర్పిస్తాను అంటే…ఎంత బతిమాలినా వద్దు అనేది…పాపం భయం ఏమోలే అనుకునే దాన్ని. కాని ఒక రోజు చెప్పింది…నాకు కుడి, ఎడమ కన్ ఫ్యూజనే….ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎవరైనా కుడి వైపు తిరుగు అంటే, నేను చేతులు ఒకటికి, రెండు సార్లు సరి చూసుకుని, ఏదో తేల్చుకుని వెళ్తాను ….బండి నడుపుతూ అంత సేపు కస్టం కదా! అని…సరదగా అంటొందేమో అనుకున్నా కానీ…అది నిజమే చెప్తోందని తెలిసాక అశ్చర్యంతో నోరెల్ల బెట్టాను.

అలాగే ఏ నెలలో ఎన్ని రోజులుంటాయో…టక్కుమని ఎవరైన అడిగితే…దాదాపు 50% మంది పైనే సరిగ్గా చెప్పలేరు.చిన్నపుడు, ఏ నెలకి ఎన్ని రోజులో గుర్తు పెట్టుకునే కొన్ని చిట్కాలు ఉండెవి…బహుశా అందరికి తెలిసే ఉంటుంది. మన చేతి వేళ్ళూ అన్నీ మూసి,పిడికిలి వెనక్కి తిప్పి…వేలి మొదట్లో ఉండే కనుపులు, లోతులు ఆధారంగా…ఎడమ వైపు నుండి మొదలెట్టి, మొదతి ఎత్తుగా ఉండెది జనవరి నెల అనుకుంటె అది…31 రోజులు, పల్లం ఉన్న చోట 30 రోజులు…ఇలా డిసంబర్ వరకు లెక్క పెట్టించే వారు.

భాషా దోషాలు ఐతే క్రమేపి సరి దిద్దు కుంటాం. కానీ…ఇలాంటి విషయాల్లో బాల్యం నుండి…ఆ కంఫ్యూసన్ అలాగే ఉండిపోతుంది…నాకు ఇప్పటికి…లిజార్డ్ కి లెపార్డ్ కి కంఫ్యూజనే…ఒక సెకన్ ఆగి…లిజి అంటే బల్లి కదా అని గుర్తు తెచ్చుకుంటాను…

ఇవి కాక కంఫ్యూజన్ తో నేను నిత్య జీవితంలో చేసిన కొన్ని పనులు చూడండీ…
నేను హాస్టల్ లొ ఉండగా…ఒక రోజు కొత్తగా మీరా షాంపూ మార్కెట్ లో వచ్చిందని ఒక బోటిల్ కొని తెచ్చుకున్నాను(మాములుగా ఇతర షాంపూ ధరల కంటే దీని ధర ఒక 30% తక్కువగా ఉండటంతో మురిసిపోయి మరీ)…మర్నాడు…స్నానానికి హుషారుగా బాత్ రూంలోకెల్లి తల పై షాంపూ వేసుకుని రుద్దు కోవడం మొదలెట్టా…నురగ రావట్లేదు. ఎంటబ్బా…ఇది కానీ నురగ రాకుండా క్లీన్ చేసే కొత్త షాంపూ కాదు కదా అనుకొని…ఇంకాస్త వెయ్యలేమొ అని మరింత నెత్తి మీద పోసాను….ఊహూ…ఇంకా నురగ రావట్లేదు….అప్పుడు అనుమానం వచ్చి బోటిల్ మీద చూస్తే తెల్సింది…అది షాంపూ కాదు-తల నూనే అని….ఆ తర్వాత మా స్నేహితులు ఈ విషయం గుర్తు చేసి కనీసం ఒక నెల ఏడిపించారు నన్ను.

ఒక రోజు మా అక్క, అమ్మ బజార్ కి వెళ్తూ, అక్క వాళ్ళ 2 ఏళ్ళ బాబు ని చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళారు. ఒకసారి పాలు కలిపి ఇవ్వు ఏడిస్తే అన్నారు. వాళ్ళు వెళ్ళాకా, కాసేపటికి పాలు కలిపి బాబుకి తెచ్చి ఇచ్చాను. వాడు కాస్త తాగి ఇంక ససేమిరా తాగను అంటాడు. ఎందుకో అర్ధం కాక,సర్లే ప్రస్తుతం ఏడవట్లేదు కదా…వాళ్ళ అమ్మ వచ్చి చూసుకుంటుంది కదా అని ఊరుకున్నాను. ఆ తర్వాత మా అక్క వచ్చాక వంటింటిలోకి వెళ్ళీ గ్లాస్ చూసి నన్ను పిలిచి అడిగింది…పాలలో పంచదార కలిపావా అని…దానికి నేను, ఆ కలిపాను అని డబ్బా చూపిస్తే…అది పగల బడి నవ్వింది.ఇంతకు నేను కలిపింది…పంచదార లాగే అంత సైజ్లో ఉన్న సగ్గు బియ్యం. వేమన గారు ఉప్పు-కర్పూరం ఒక్క పోలికలు అన్నారు కానీఎ…ఈ పంచదార-సగ్గు బియ్యం చెప్పలేదు చెప్మా అని ఒక సారి ఆ పద్యం గుర్తు చేసుకున్నాను.

ఇలా నిత్య జీవితంలో మనం అమాయకత్వం వల్లనో, అజ్ఞానం వల్లనో కంఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. తర్వాత తల్చుకుంటే నవ్వు తెప్పిస్తాయి. ఈ మత్రం నేను చూసుకోలేదా అని ఆశ్చర్య పరిచేలా ఉంటాయి.

ప్రకటనలు

10 వ్యాఖ్యలు to “కంఫ్యూజన్..”

 1. వీవెన్ Says:

  నాకు ఆఫీసులో 8వ అంతస్గు కి 2వ అంతస్థుకి అయోమయం. 8వ అంతస్గు లో ఉండి, 2వ అంతస్థుకి వెళ్ళాలంటే, నేను పైకి వెళ్ళివస్తా అనేవాడిని. 2వ అంతస్థు నుండి 8వ అంతస్థుకి వెళ్తున్నాని చెప్తూ కిందికి చూపించేవాడిని.పక్క వాళ్ళు అదోరకంగా చూసేకా నాలుక కరుచుకునేవాడిని. సంవత్సరం తర్వాత కూడా ఇంకా అది పూర్తిగా వదలలేదు. మన ఆఫీసు 2వ అంతస్థుకి తర్వాత వ్యాపించడంవల్ల , అది కొత్తగావచ్చింది కాబట్టి పైన ఉంటుంది అని నా సబ్కాన్షష్ మైండ్ (నాగరాజు గారి భాషలో “నిదురించే తోట”) అనుకుంటుంది.

 2. ప్రసాద్ Says:

  ఈ అయోమయాల చిట్టా మొదలెట్టిన చదువరి కి, మీ అయోమయాలు పంచుకున్నందుకు మీకూ కృతజ్ఞతలు. భలే సరదాగా వున్నాయి.

  –ప్రసాద్
  http://blog.charasala.com

 3. వెంకట రమణ Says:

  నాకు చాలా రోజులపాటు కుడి, ఎడమల అయోమయం ఉండేది. దీన్ని తప్పించుకొనడానికి నేను నా కుడిచేతికి ఎప్పుడూ కాశీదారం ఉండేట్టు చూసుకునే వాన్ని :).

 4. సుధాకర్(శోధన) Says:

  నాకు ఇప్పటికీ ఈ కుడి ఎడమల అయోమయం వుంది. చాలా మంది ఆటో వాల్లు ఖంగు తిన్న సందర్భాలు వున్నయి. నేను కుడి బదులు ఎడమకు తిరగమంటా…గానీ అక్కడో పెద్ద చెత్త కుప్పో, గోడో వుంటుందిమరి. ఇదెలా పోతుందో నాకే తెలియటం లేదు 😦

 5. రానారె Says:

  స్కూల్లో ఒకసారి నేను ఇంగ్లీషు పరీక్ష రాస్తున్నప్పుడు was ని saw అని మార్చి రాశాను. తప్పనిపిస్తోంది, కానీ ఏంతప్పో, వాజ్ స్పెల్లింర్ ఏమిటో తట్టక కనీసం పదినిముషాలపాటు తలపట్టుకున్నాను. చివరకు గుర్తురాక అలాగే వదిలేశాను. మేథావుల లక్షణాలన్నమాట, ఖామెడీగా.

 6. valluri Says:

  నాకు కూడా ఈ కుడి ఎడమలూ కంఫ్యూజనే! అందుకు నేను ఫాలొ అయ్యె ఉపాయం ఏమిటంటే, నేను నా కుడి చేతికి ఉంగరాలు పెట్టుకుంటాను. ఈ కంఫ్యూజను వచ్చినప్పుడల్లా నా ఉంగరాలకేసి చుస్తాను.

 7. చదువరి Says:

  కుడియెడమలకు తేడా తెలియని దేవదాసులు 😉 నిజజీవితంలోనూ ఉంటారని నేననుకోలేదు. అందునా మన బ్లాగరుల్లోనే ఇంతమంది!! నా అనుభవం ఒకటి.. అయితే తికమక కాదు, తెలుగు తెలియనితనం. ఎప్పుడన్నా ఊరినుండి వచ్చినపుడు ఆటోలో ఇంటికెళ్తూ కుడికిపో, ఎడమకుపో అని చెబుతూ ఉంటే కొందరు డ్రైవర్లకు – తెలుగువాళ్ళే – అర్థమయ్యేది కాదు. రైటు, లెఫ్టు అని ఇంగ్లీషులో చెబితేనే సరిగ్గా పొయ్యేవారు. నాకు ఒకటి రెండు సార్లు అనుభవం లోకి వచ్చిందిది.

 8. సుధాకర్(శోధన) Says:

  ఇది చదవండి…

  http://faculty.washington.edu/chudler/java/hands1.html

 9. vijaya Says:

  నాకు కూడా కుడి, ఎడమల కంఫ్యూజన్ పెద్దయ్యాకా ఉంటుందని తెలీదు…తీరా చూడబోతే-నేను బ్లాగ్ లో చెప్పినట్టు నా స్నేహితులలో కనీసం 25% మందికి ఆ కంఫ్యూజన్ ఉంది.బాగా తెలివైన కొంత మంది…నాకు కుడి, ఎడమ కంఫ్యూజన్ అంటే తమాషా కి అంటున్నారు అనుకునే దాన్ని. కానీ నిజం అని తెలిసి ఆశ్చర్య పోయాను. ఇప్పుడు మన బ్లాగర్ లు కూడా ఆ విషయాన్ని నిర్ధారించారు.

 10. రాకేశ్వర రావు Says:

  నేను చాలా సార్లు రోడ్డులో టీ జంక్షన్ దగ్గర బండాపి, టర్ను తీసుకున్నాక రోడ్డుకి ఏప్రక్కకు వుండాలో అని చాలా సేపు ఆలోచిస్తాను.
  ఇక అమెరికా వెళ్లోచ్చిన తరువాత పరిస్థితి మరీ ఘోరం.

  ఇక నా sense of direction బాగుండటంతో చాలా సార్లు దారి చెబుతూవుంటా.. అప్పుడు మీ వైపు తిరగండి, నేనున్న వేపు తిరగండి అంటా.. కుడి ఎడమ తెలియక.

  ఇక డాన్సు క్లాసుల్లో ..
  gentlemen move your left hand over the ladies’ right shoulder, as the ladies step their right foot in front of their left లాంటివి విని మూర్ఛవచ్చేది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: