పురాణాల్లో కల్పితాలు

త్రివిక్రం గారి బ్లాగు కి ఇంకాస్త జత చేస్తూ..

ఇంకా ఇవన్నీ(https://www2.blogger.com/comment.g?blogID=22436932&postID=7144061277391652676)

 నయమే…నేను అస్సలు నమ్మలేనిది..పురాణాల్లో వేల సంవత్సరాలు బతికేయడం. దశరధుడు ఎకంగా 60 వేల సంవత్సరాలు రాజ్యం చేసాడని ఎక్కడో చదివాను. అలాగె రాముడు కూడా 10 వేల సంవత్సరాల దాక ఏలాడట. పోనీ నిజంగా అన్ని ఏల్లు ఎలాడనె అనుకుందాం. అన్ని సంవత్సారాలు బతికే మనిషికి కేవలం 14 యేల్లు వనవాసం అసలు ఏ మాత్రం లెక్కలోకి వస్తుంది? ఏదో మనం సరదాగ పిక్నిక్ కి వెళ్ళినట్టు కాదూ? ఆ మాత్రం కాలంలో జరిగిన విశేషాలకే రామయణం అనే పెద్ద కావ్యం. అసలు 14 ఏల్లలోనే అన్ని సాధించిన రాముడు 10 వేలు సంవత్సరాలు పాలిస్తే ఎన్ని ఘన కార్యాలు చేసి ఉండాలి? (క్లుప్తంగా రామ రాజ్యం అని ఒక్క మాటతో తెల్చేస్తారు కదా).

ఏంటో మనం గట్టిగా 60 ఏల్లు బతకడానికే అవస్తలు పడుతుంటే ఏకంగా వేల ఏళ్ళు ఎలా బతికేసేవారో ఏంటో? ఇంకా దేవి పురాణంలో చదివాను శివుడు, పార్వతి కొన్ని వేల సంవత్సరాలు సంభొగంలో ఉండిపోయారట (కుమార స్వామి పుట్టే ముందు). అసలు కుమార సంభవం వెనుక ఒక లోక కంటకుడైన రాక్షషుడి వధ లక్ష్యం.ఇలా వీల్లు ఇన్ని వేల సంవత్సరాలు ఎలా గడిపేస్తారు ఆ రాక్షషుడి గురించి మర్చిపోయి? ఎమైనా అంటే బ్రహ్మకి ఒక పగలులో మనకి 4 యుగాలు గడిచిపోతాయి అని చెప్తారు.పోనీ దేవుల్లకి అంటే ఇది ఎలాగో సాధ్యం కాబట్టి..నమ్మి వదిలేద్దం. మనిషిగా పుట్టిన రాముడు, కృష్ణుడు, ఇంకా అంత ముందు రాజులూ అందరూ వేలకి వెల ఏల్లు బతికేసేవాళ్ళే!! అన్ని సంవత్సరాలు బతికే వాళ్ళకి ఒక్క 10 ఏల్లు వనవాసం గడపడానికి ఏమంత పెద్ద కష్టమో కదా??

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “పురాణాల్లో కల్పితాలు”

 1. Prasad Charasala Says:

  భలే చెప్పారు!
  అవన్నీ కల్పితాలేనని ఒప్పుకుతీరాల్సిందే! కాకపోతే మన పూర్వులు బ్రహ్మాండమైన కలిత రచయితలు (fiction writers) అని బల్ల గుద్ది వాదించవచ్చు.
  సత్యాసత్యాలను వదిలేద్దాం నీతి మాత్రమే అర్థం చేసుకుందాం అని ఎవరైనా అంటే నేను సిద్దం.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. radhika Says:

  http://neetikathalu.wordpress.com/files/2006/11/reply1.pdf
  ఇది ఒక్క సారి చూడండి.అన్ని సంవత్సరాలు ఎలా జీవిస్తారు అన్న దానికి నీతికధలు లొ వారు ఇచ్చిన సమాధానం ఇది.పురాణాలన్ని కల్పితాలని అనలేము.ఎందుకంటే క్రిష్నుడు జీవించినట్టు గా ఇప్పుడు అదారాలు లభించాయికదా.రాముడు లంకను చేరిన వారధి కూదా ఈ మద్యనే బయటపడింది.http://maps.google.com/maps?t=k&hl=en&ll=9.096164,79.556465&spn=0.475962,0.582275

  http://en.wikipedia.org/wiki/Rama%27s_Bridgeఅప్పుడు పురానాల్లో చెప్పబడిన ఎన్నో విషయాలను ఇప్పుడు మనవాల్లు నిజం చేస్తున్నారు కదా.అప్పటి పురాణాలను తిరిగి రాయడం లోను,అనువాదం చేయడం లోను కవులు,రచయితలు స్వతంత్రం గా వ్యవహరించడం వల్ల కొన్ని కొన్ని అతిశయాలుగా చెప్పబడి వుండవచ్చు.రామాయణం లో గుహుని పాత్ర గురించి తెలిసే వుంటుంది.నిజానికి వాల్మీకి రామాయణం లో గుహుడు లేడట.తరువాతి తరువాతి కవులు కొన్ని పిట్టకధలను వెలుగులోకి తెచ్చారు అంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: