ఎలా అర్ధం అవుతాయో??

ఇవాళ క్రిస్ట మస్ కదా…ఎప్పటి నుండో నా మనసులో అనుకుంటున్నది మీకు చెప్పాలని ఈ బ్లాగ్ రాస్తున్నా..
ఏసు ప్రభువు త్యాగం ఎనలేనిది, ఆయన పూద్యుడు.
ఆయన ప్రేమ తత్వం సరి అయిన మార్గంలో ప్రపంచానికి అంద చెయ్యొచ్చు కదా..
చర్చ్ లలో, క్రిస్టియన్ సమావేసాలలో వాల్లు చెప్పేది ఎమున్నా, ఎలా వున్నా…వాల్లు వాడే పదాలతో విసుగు తెప్పిస్తారు.
“వచ్చుడి”,”చూసెడి”,”పాపులారా”,”పరిశుద్దాత్మ”,”కాపరి”,”దేవుని బిడ్డలార”…ఇలా వీళ్ళు మాత్రమే వీళ్ళకి మాత్రమే అర్ధం అయే మాటలనే పదే పదే వాడి…మిగిలిన వాళ్ళకి ఏసు ప్రభువు గురించి తెలుసుకోవడం అంటే ఇంతేనేమో అన్న అభిప్రాయం కలుగుతోంది.
అసలు నాకు అర్ధం కాని విషయం, అసలు వీళ్ళ తెలుగు తర్జుమా ఎందుకు ఇంత ప్రత్యెకంగా ఉంటుంది.
మామూలు తెలుగులో కి చక్కగ అనువదించవచ్చు కదా.
అసలు ఇంగ్లీష్ బైబిల్ కూడా ఇలాగే పరిమిత పదాలతో ఉంటుందా?
మా ఇంటి దగ్గర ఒక చర్చ్ గోడల పైన దాదాపు 20 సూక్తులు ఉంటాయి. రోజూ చదువుతాను కానీ నాకు ఒక్క దాని భావం కూడా అర్ధం కాదు. కామన్ గా నేను పైన చెప్పిన పదాలు తప్ప ఇంకేమి గుర్తు రావు.
ఎందుకో ఇలా!!! ఇది విమర్శ కాదు…వాళ్ళు మంచిగా అందరికి అర్ధం అయే భాషలో రాయొచ్చు కదా అని నా బాధ అంతే!

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “ఎలా అర్ధం అవుతాయో??”

 1. శోధన Says:

  అవునండి, ఇదే మాట ఒక సారి బ్లాగర్ల మీట్ పిచ్చా పాటిలో చెప్పా. తెలుగును ఎలా వాడితే జనాలు పారిపోతారో చెప్పటానికి.

  క్రీస్తు జీవితాన్ని అద్భుతంగా తెలుగులో అందంగా హ్రుదయానికి హత్తుకునేట్లు చెప్పవచ్చు. నిజానికి కొన్ని చిత్రాల పాటలు కూడా మంచివి ఉన్నాయి. ఇప్పడు మీరు పైన పేర్కొన్న పదాలన్నీ బ్రిటీషు వారి కాలంలో దొరలు కష్టపడి తెలుగీకరించిన సాహిత్యం అన్న మాట. అందువలన అంతా true translation కనిపిస్తుంది.

  కానీ ఒక్క సారి ఆలోచిస్తే తెలుగు ఖూనీ కాకుండా ఉన్నది బైబిల్ సువార్తలలోనే అని నాకనిపిస్తుంది. కాకపోతే ఈ పదాలని దీర్ఘాలు తీసుకుంటూ మాట్లాడితే కొద్దిగా అదోలా ఉంటుంది.

 2. రవి వైజాసత్య Says:

  ఇంగ్లీషులోను అంతే కింగ్ జేంస్ సంచిక చదవాలంటే తల బొప్పి కడుతుంది. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ కొద్దిగా నయం. కొత్త తరానికి కొత్త అనువాదం తప్పకుండా కావాలి.

 3. Prasad Charasala Says:

  ఈ బైబిల్ తెలుగు కొంచం కొత్తగా వున్నా మనకు అర్థం కానిదేమీ లేదే! ఆ మాటకొస్తే ఒక్క ఆంగ్లపదమూ లేకుండా అచ్చ తెలుగులో మాట్లాడి, రాసి వీళ్ళు తెలుగుకు న్యాయమే చేస్తున్నారనాలి.
  –ప్రసాద్
  http://blog.charasala.com

 4. T.Bala Subrahmanyam Says:

  మనకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న బైబిల్‌లోని తెలుగే నిజానికి 18వ శతాబ్దంలో అందరికీ అర్థమైన తెలుగు. అందుకే ఆ భాషనే అప్పటి బైబిల్ అనువాదకులు ఎంచుకున్నారు. అది ముఖ్యంగా ఆ రోజుల్లో రాయలసీమ మద్రాసు ప్రాంతాల వ్యవహారంలో ఉండిన తెలుగు. అందుకే బ్రౌను దొరగారు రాసిన తెలుగు పుస్తకాల్లో కూడా మనకి ఇదే తెలుగు కనిపిస్తుంది. ఆ తెలుగు ఈ రోజు మనకి ప్రత్యేకంగా కనిపించడానికి కారణం – మన చెవులు గోదావరి-కృష్ణా-గుంటూరు జిల్లాల భాషాసంగీతానికి పూర్తిగా వశమై పోవడం. భాషా పరిశోధన దృష్ట్యా చూస్తే నన్నయగారి భారతం లాగానే బైబిల్‌తెలుగు మన జాతికి అత్యంత ముఖ్యమైనది.ఎందుకంటే ఈనాటి వ్యవహారంలో లేని ఎన్నో వాడుకలూ పదాలూ తెలుగు బైబిల్‌లో పరిరక్షించబడ్డాయి. మనకి అర్థం కాకపోతే సరళ, సులభ పాఠాంతరాలు రాసుకోవడంలో తప్పులేదు కాని ఉన్న బైబిల్‌ని ఏకమొత్తంగా మారుస్తామంటే మటుకు ఎంతమాత్రం అంగీకరించకూడదు. అసలు ఒక్క అక్షరం కూడా మార్చడానికి వీల్లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: