మన దేశంలో ప్రజా స్వామ్యం

త్రివిక్రం గారి మన దేశంలో ప్రజా స్వామ్యం బ్లాగ్ కి చామెంట్ పోస్ట్ చేయ్యడానికి కుదరలేదు. అందుకే నా స్పందన ఇలా..
మీరు చెప్పేదంతా థియరిటికల్ గా బాగుంది.కాని ఇవన్నీ అలోచించి వోట్ వెయ్యాలి అని వెల్లమే అనుకోండి..ఆ లిస్ట్ లో ఉన్న ఏ అభ్యర్థి మనకి నచ్చడు. మన ఆంధ్ర ప్రదేశ్ లోనే తీసుకుంటే కాంగ్రేస్, టీడీపి తప్ప ఆప్షన్ ఏముంది? ఒకవేల ఇండిపెండంట్ అభ్యర్థి మంచి వాడు అని వేసినా అతను కూడా ఎదో ఒక గుంపులో చేరిపోతాడు కదా!! సరే ఎవరూ నచ్చకపోతే మన వోట్ ని రద్దు చేసుకునే అవకాశం కూడా మన రాజ్యాంగం  కల్పించింది.49-0 సెక్షన్ కింద మనకి నచ్చక పోతే వోట్ రద్దు చేయొచ్చట. కాని అలా అందరు చేస్తే కాసిన్ని వోట్లు వచ్చిన వాళ్ళు మన నాయకులై కుర్చుని తీరతారు కదా. మరి ఈ విష వలయం నుండి ఎలా బయట పడటం? మంచి పార్టీ, మంచి నేతలు అంటూ ఉంటేనే మనం ఆలోచించినా వోట్ వేసినా ఉపయోగం.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు to “మన దేశంలో ప్రజా స్వామ్యం”

 1. త్రివిక్రమ్ Says:

  “…ఆ లిస్ట్ లో ఉన్న ఏ అభ్యర్థి మనకి నచ్చడు”

  అందుకే బాలట్ పేపర్లో “None of the above” అనే ఆప్శన్ లేకపోవడం అతిపెద్ద లోపమని కూడా రాశాను. దానికి సమాధానంగా మీరు పేర్కొన్న “ఓటును రద్దుచేసుకునే అవకాశం” ఆసక్తికరంగా ఉంది. ఏ నియోజకవర్గంలోనైనా నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు అక్కడ పోటీలో నిలిచిన అభ్యర్థులందరినీ అనర్హులుగా ప్రకటిస్తేనైనా మన నేతలకు బుద్ధి వస్తుందేమో?

 2. రానారె Says:

  నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు ఆ ఎన్నిక రద్దవుతుందని, ఆ అభ్యర్థులు మళ్లీ పోటీకి అనర్హులనీ ఈ అంశంగురించి ఎక్కడో చదివాను.

 3. వల్లభనేని చంద్రశేఖర్ » Blog Archive » మన దేశంలో ప్రజాస్వామ్యం-2 (సెక్షన్ 49 ‘O’) Says:

  […] “నిర్ణీతశాతం కంటే ఎక్కువమంది ఓటర్లు తమ ఓట్లు రద్దు చేసుకున్నప్పుడు ఆ ఎన్నిక రద్దవుతుందని, ఆ అభ్యర్థులు మళ్లీ పోటీకి అనర్హులనీ ఈ అంశంగురించి ఎక్కడో చదివాను.” – అభిరామ్ బ్లాగులో రానారె వ్యాఖ్య. […]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: