యాహూ…

యాహూ… అని అరుచుకొంటూ రాత్రి 9.30 కి ఈ టీవీలో ఒక ప్రోగ్రాం వస్తుంది.
దిక్కుమాలిన కొన్ని ప్రశ్నలు అడిగి ఊరించే బహుమతులు ఇచ్చే అనేక ప్రోగ్రాంలలో ఇది కూడా ఒకటి.ఇలాంటి ప్రోగ్రాంలు చూడటం,ఆనందించేయడం పెద్దవాల్లకు ఎలాగూ అలవాటు అయిపోయింది. ఈ మద్య చిన్న పిల్లలతో కూడా మొదలెట్టారు ఈ ప్రొగ్రాం.
అసలు మనం పిల్లల ఐ qయు లెవెల్ ని ఏ రకంగా పాడు చేస్తున్నమో ఈ ప్రొగ్రాం చూస్తే తెలుస్తుంది.
ఇలాంటి ప్రొగ్రాంస్లో ఎక్కువ సినిమాలకి సంబందించిన ప్రశ్నలే అడుగుతారు కాబట్టి అక్కర్లేని సినిమా జ్ఞానం అంతా తలకి ఎక్కించుకుని పిల్లలు తమ బుర్రలు పాడు చేసుకుంటున్నారు.
అశొక్ సినిమాలో ఎవరు హిరోయిన్,జెనీలియా మొదటి సినిమా ఎంటి? ఈ బొమ్మలో వున్న హీరో గాఇ రీసెంట్ సినిమా ఎంటి?మెము ఇచ్చే హింట్ తో సినిమా పాట కనుక్కొగలర? ఇవీ దాదాపుగా అందులో ప్రశ్నలు.
ఇవి పిల్లల భవిస్యత్తుకి గాని, మెదడుకి పదును పెట్టడానికి గాని ఏమత్రం వుపయోగపడతాయి?
మొన్న ఒక రోజు ఎపిసోడ్లో..ఆ ప్రోగ్రాంలో అరిచే వ్యక్తి(అదేలే యాంకర్) నేను ఇప్పుడు ఒక ఫొటో చూపిస్తా…ఇది ఎవరో చెబితే ఇక ఏ ప్రశ్నలు లేకుండానే మీకు ఒక టీవీ బహుమతి ఇచ్చేస్తా అని చాలెంజ్ చేసాడు.
పాపం సినిమాలు తప్ప లోకం తెలియని ఆ పిల్లలు తెల్ల మొహం వేసారు ఆ ఫోటోలొ వ్యక్తి ఎవరో తెలియక. ఇంతకు ఆయన ఎవరు అంటె విప్రో అధినేత-ప్రేం జీ. ఆ తర్వత మరో ప్రస్న- గాంధీజీ భార్య పేరు ఎంటి?…పిల్లలు నోరు ఎత్తితే ఒట్టు. అదే సూర్యా ఇటీవల పెల్లి చేసుకున్నది ఎవరు అంటె…బజర్స్ పోటీ పడి మోగాయి..జ్యోతిక అని చెప్పడానికి.
అసలు మనం పిల్లలని ఎలా తయరు చేస్తున్నం? జనరల్ నాలెద్జ్ కాని, మన చరిత్ర కాని, గొప్ప వ్యక్తుల గురించి కాని నేర్చుకునే సమయం బాల్యం.అప్పుడు తెలుసుకున్న విషయాలు భావి భవిస్యత్ పైన చాల ప్రభావం చూపిస్తాయి.
తొక్కలో టీవీనో, సీడీ ప్లేయరో బహుమానం వస్తుంది అని ఆశ పడి, తల్లితండ్రులు పని కట్టుకుని మరీ తమ పిల్లల బుర్రలు పాడు చేస్తున్నరు అని నా అభిప్రాయం.
ఒకప్పటి బోర్న్విటా qవిజ్ లాంటి ప్రొగ్రాంలో దడ దడ లాడించిన ఆనాటి పిల్లలను, ఈ ప్రోగ్రాంలో పిల్లలతో పోల్చుకుంటె…నాకు చెప్పలేనంత నిస్ప్రుహ వచ్చింది.

ప్రకటనలు

6 వ్యాఖ్యలు to “యాహూ…”

 1. radhika Says:

  avunandi ippudu programs anni alage vuntunnayi.cinema la gurinci maata leani okka prograamu kuuda vundatedu.

 2. సుధాకర్ Says:

  దీనికి ఒక గొప్ప పేరు కూడా ఉందండీ…యాహూ సూపర్ కిడ్స్ అంట…మొన్న ఒక ప్రశ్న విని నాకు మతి పోయి చానల్ మార్చేసా…

  అది

  ఎలిఫెంట్ ని తెలుగులో ఏమని అంటారు…

  ౦౧. పులి
  ౦౨. ఏనుగు
  ౦౩. సింహం
  ౦౪. ఎలుక

  తల్లి తండ్ర్లులు తమ పిల్లలను ఈ కార్యక్రమంలో పాల్గొననిచ్చినందుకు సిగ్గుపడాలి….

 3. valluri Says:

  ఇలాంటి చెత్త పోగ్రాములని మరికొన్ని ఛానల్స్ కూడా ప్రసారం చెస్తూన్నాయీ. ఒక ఛానల్లో మతి లేని ప్రశ్నలకి సమాధానము చెప్తే బంగారం బిళ్ళలు ఇస్తున్నారని ఆడవాళ్ళు అందరూ ఇళ్ళు వళ్ళు మరిచి మరి టివిలకి అతుక్కుపొతున్నారు.

 4. PRUDHVI Says:

  YA AVUNU ADI MATRAM NIZAM ELANTI PROGRAMMES VALL PILLALU CHALA NASHANAM AVUTHUNNARU
  PILLALA IQ PENCHE OKKA PROGRAMME KUDA LEKUNDA ILANTI CHETHA PROGAMMES NI RUN CHESE VALLANU NARIKEYALI………………..

 5. KETHA VENKATESWARA RAO Says:

  Your comment is excellent correct. The children are paying concentration on unnecessary programmes. These should be banned immediately to save our children from clutches of these useless programmes. Even elders are also addicted to these nasty programmes. I completely hate these types of programmes.

 6. KETHA VENKATESWARA RAO Says:

  Your comment is excellent correct. The children are paying concentration on unnecessary programmes. These should be banned immediately to save our children from clutches of these useless programmes. Even elders are also addicted to these nasty programmes. I completely hate these types of programmes.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: