సిటీ బస్ ప్రయాణంలో..

ఆర్ టీ సి బస్ లను తిట్టుకుంటాం కాని, అందులో ప్రయాణం వల్ల చాల లాభాలు వున్నాయి అని స్వీయానుభవంతో తెలుసుకున్నాను.
మా ఇంటికి ఆఫీసుకి 10 కి.మి దూరం ఉంటుంది.
రోజూ ఈ హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ఈ దూరం ప్రయాణించడానికి 30-45 నిమిషాలు దాకా పడుతుంది.రోజూ 2 వైపులా ఆటో లో రావడానికి నా పర్సు ఒప్పుకోక ఒక వైపు బస్ లో వెళ్దాం అని అనుకున్నాను. కాని ఆటోలో వస్తే అరగంటలో వచ్చేది, బస్ లో ఐతే అటు చేసి ఇటు చేసి గంట పట్టేస్తుంది.
ఆఫీస్ కి వచ్చేపుడైతే బోలెడు జనం, నిలబడి వెళ్ళాలి, పైగా లేట్ ఐపోతోంది. అందుకని ఈ మద్య ఇంటికి వెళ్ళేపుడు బస్ లో వెళ్ళడం మొదలెట్టాను.
బస్లో సీట్ దొరికితే ఇంకేమీ, బోలెడు పండగే..ఎలాగూ 45 నిమిషాల పైనే పడుతుంది కాబట్టి, ఆ టైంలో బోలెడు పనులు చేయొచ్చు.
ఇంట్లో ఎప్పుడు హడావిడిగా,బిజీగా గడిచిపోయే నాకు, పుస్తక పఠనం ఒక అందని మావిలా తయారైంది ఈ మద్య. చక్కగా ఈ బస్ ప్రయాణాం పుణ్యమా అని మినిమం అర గంట అయినా చదవచ్చు. ఆటోలో పగలు వెలుతురు ఉండగా చదువుదాం అంటె ఒకటే కుదుపు…కళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక చీకటి పడ్డకా చదివే వీలు ఉండదు. పాపం ఆర్టీసీ వాల్లు మనకి దీపం పధకం కూడా కల్పిస్తారు కాబట్టి కుదురుతోంది.
ఒకోసారి ఆఫీస్లో బాగా స్ట్రైన్ అయిన రోజు, ఇంటికి వెల్లి వెంటనే పని చేసుకోవాలి అంటె విసుగ్గా ఉంటుంది, అలా అని ఇంట్లో కాసేపు పడుకోడానికి కుదరదు. కిటికి దగ్గర సీట్ దొరికితే, ఇంటికి వెల్లే లోపు హాఇగా ఒక కునుకు తీసేయొచ్చు.బస్ దిగే సరికి రిలాక్స్ అయిపోతాము.
ఆటో వాడికైతే ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని రూట్ చెప్పాలి. లేకపోతే మీటర్ని పరుగులు పెట్టించడానికి వాడి ఇస్టం వచ్చిన రూట్లో తీసుకెల్తాడు. మన ఆర్టీసీ బస్ డ్రైవర్ గారు నా దారి రహదారి అనుకొంటూ, ఒకే రూట్లో తీసుకెల్లిపోతాడు.
చక్కగా బస్ కిటికీ నుండి పరిసరాలను పరిశీలిస్తూ గడపవచ్చు.
ఆటోలో అయితే ఎంత వద్దు అనుకున్నా మన దృస్టి విష్ను చక్రంలాగ తిరిగే మీటర్ మీదకే పోతూ ఉంటుంది.
ఇక బస్ స్టాప్ నుండి ఎవరి ఇంటికి అయినా కనీసం 5-10 నిమిషాలు నడిచే దూరం ఉంటుంది (అదెంటో కదా ఎవరి ఇంటికి అయినా ఇలా బస్ స్టాప్ కాస్తో కూస్తో దూరంలోనె ఉంటుంది!!) కాబట్టి కాస్త నడిచే చాన్స్ అలా అయినా దొరుకుతుంది
ఆఫీస్లో మా ఫ్రెండ్స్ కొందరు, ఎందుకు అలా పిసినారిలాగ బస్ లో వెళ్తావ్, హాయిగా ఆటోలో పొవచ్చు కదా అంటారు.వాళ్ళకేం తెలుసు ఇన్ని లాభాలు ఉన్నాయి బస్ ప్రయాణంలో అని.
పైగా ఇన్ని లాభాలు పొందుతూ కూడా నాకయ్యే ఖర్చు ఆటో ఫెయిర్ లో 10 వ వంతు మాత్రమె!!

గమనిక: సున్నాకి విలువ పక్కన ఒకటి ఉన్నపుడే అన్నట్టుగా, ఈ ఆర్టీసి బస్ లాభాలు కూడా, కేవలం సీట్ దొరికినప్పుడే సుమండీ!!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “సిటీ బస్ ప్రయాణంలో..”

 1. charasala Says:

  బస్సు ప్రయాణంలో లాభాలు చాలా చక్కగా చెప్పారు.
  నేను DC Downtownలో ఉద్యోగం చేయడం మొదలెట్టాక ఒకవైపు ప్రయాణం 50 నిమిషాలు వుంటుంది. అయితే ఆ సమయమే నాకు ఎంతో ఇష్టమైన్ సమయమైపోయింది. పుస్తకం చదువుకోవచ్చు. iPodలో పటలు వినవచ్చు, లేదా కునుకూ తీయవచ్చు. మీకులాగే నేనూ ఎంజాయ్ చేస్తున్నాను.
  –ప్రసాద్
  http://charasala.com/blog/

 2. Phani Kumar Says:

  This is Phani and new to WordPress. Dear can you just guide me how to change the language to telugu and write some posts in it. I tried to change in Options and as well as My Profile. It gets changed but not reflecting when i try to write a new post. Thanks in advance for your support. You can just put a mail to me at kompellaphani@gmail.com

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: