నీ కృషియే నీ జాన-నీ బద్దకమే నీ బెత్త

నీ కృషియే నీ జాన-నీ బద్దకమే నీ బెత్త

 పై కొటేషన్ అర్దం కాకుండాను, గమ్మత్తుగాను ఉంది కదా. ఇది నేను 10వ తరగతి చదువుతున్నపుడు మా లెక్కల మాస్టారు చెప్పినది. మాకు వేసవి శలవలు అయి 10వ తరగతి క్లాసులు స్టార్ట్ అయిన మొదటి రోజు లెక్కలు చెప్పడానికి కొత్త మాస్టారు వచ్చారు. ఆయన చాల స్ట్రిక్ట్ అని అప్పడికే మా సీనియర్స్ ద్వారా విని వున్నాము. అందరూ భయపడుతూ ఉన్నం ఆయన ఎం చెప్తారా, ఎం తిడతారా అని. క్లాస్ లోకి రాగనే పరిచయాలు అయాకా, బోర్డ్ మీద చాక్ పీస్ తో పెద్ద పెద్ద అక్షరాలు వ్రాసారు “నీ కృషియే నీ జాన, నీ బద్దకమే నీ బెత్త” అని. మీరంతా లెక్కలకి అని పెట్టుకున్న నోట్ బూక్ తీసి ముందు పేజీలో పెద్ద అక్షారాలతో నేను బోర్డ్ మీద రాసినది వ్రాసుకోండి అన్నారు. మేమంతా దాని అర్ధం ఏంటో, అసలు ఎందుకు రాసుకోమంటున్నారో అర్దం కాక అశ్చర్యపోయాం. దాని అర్ధం ఏంటో అప్పుడు వివరించారు ఆయన.మీరంతా ఇవాళ 10వ తరగతిలోకి వచ్చారు.కష్టపడి చదివితే చక్కగా పాస్ అయి కాలేజీలో అడుగు పెడతారు.మంచి భవిస్యత్తు చూస్తారు. కృషి చేసి 10వ తరగతి పాస్ అయితే మీకు పాస్ సర్టిఫికెట్ వస్తుంది.అది జానెడు ఉంటుంది.అదే బద్దకించి చదవడం మానెస్తే ఫెయిల్ అవుతారు.ఫెయిల్ అయిన వాళ్ళకి కేవలం బెత్తడంత ఉండే మార్క్స్ లిస్ట్ మాత్రమే వస్తుంది. కృషి చేసి జానెడు పత్రం తెచ్చుకుంటారో, బద్దకించి బెత్తెడు ముక్క తెచ్చుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించారు. మొదటి రోజు ఆయన చెప్పిన ఈ మాటల్లో కాస్త చమత్కారం ఉన్నా,దానిలోని నిజాన్ని గ్రహించిన మేము సంవత్సరం పొడుగునా ఈ మాటలు మననం చేసుకుంటూనే ఉండేవాళ్ళం.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: