టీవీలో కొత్త సినిమా

ఇటీవలే విడుదల అయిన కొత్త సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఎదో ఒక టీవిలో అడప దడపా వేసేస్తూ ఉండటంతో అసలె ధియేటర్లో సినిమాలకి తీసుకెల్లమంటె విసుక్కునే మా వారికి తన వాదనకి ఇంకో బలమైన పోఇంట్ దొరికినట్టు అయింది. ఎంత కొత్త సినిమా అయిన ఒక 3-4 నెలలు ఆగితే టీవిలో వచ్చెస్తుంది, చక్కగా ఇంట్లో కుర్చుని చూడొచ్చు కదా అని!! ధియేటర్లో టిక్కెట్స్ కోసం పాట్లు, అదొక పనిలాగ వెల్లడం, రావడం ఎందుకు అని.

పేరుకు కొత్త సినిమాలు టీవిలో అంటారు కాని 100 ఏడ్స్ మద్యలో చిన్న చిన్న ముక్కలుగా ఇరికించిన ఆ సినిమాని ఇదిగో మీకోసం అంటు మన పైకి వదులుతారు.గట్టిగా ఒక సీనో ఒక పాటొ అయె సరికల్ల మీరు చూడాల్సింది ఆ సినిమాని కాదు,మమ్మల్ని మీ దగ్గరకి తీసుకురావడానికే అసలు ఆ కొత్త సినిమా ముక్కలు ఉన్నది అంటూ ఏడ్స్ బయలుదేరతాయి.
అదీ కాక మంచి సినిమాలు ఏదో ఒక పండగో-పబ్బమో ఉన్న రోజే వేస్తారు.ఇక మన ఇంట్లో పనులు మానుకుని,పండగ సెలెబ్రేషన్ అంటె అదేదో టీవీ చూస్తూ గడిపేయడమె అన్నట్టు తయారవుతుంది.
సరిగ్గా మంచి సీన్ వచ్చినప్పుడు ఎవరో తలుపు కొట్టడమో,నీల్లు రావడమో,కరెంట్ పోవడమో జరిగితే ఇంక మన నిరుత్సహాన్ని మాటల్లో చెప్పగలమా??
పండగ కదా అని చుట్టాలు పట్టలు వస్తే వాళ్ళెప్పుడు వెళ్ళిపోతార,సినిమా మిస్స్ ఐపోతోంది అని ఎదురు చూడటం,లెక ఏడ్స్ వచ్చినపుడు మాత్రమె వాళ్ళని పలకరించడం,వాళ్ళకి తీనడానికి ఏదైనా పెట్టడం జరుగుతుంది.
ఇక మంచి సినిమా వచ్చినపుడే కర్మ కాలి క్రికెట్ మ్యాచ్ గాని ఉందంటే, ఇటు సినిమాని, అటు మ్యాచ్ ని వదలలేని మా మావగారి లాంటి వాళ్ళు చానల్స్ ని మారుస్తూ చూస్తూ ఉంటే చూసిన తృప్తి ఏం మిగులుతుంది?
టీవిలో కొత్త సినిమా చూడాలంటే ఇన్ని పాట్లు పడాలి. ఎందుకొచ్చిన గొడవ?చక్కగా ధియేటర్లోనె ఆడుతున్నపుడు వెల్లి చూసి వచ్చేస్తే, టీవిలో అది వచ్చినపుడు దాని మీద ఇంక క్యూరియాసిటీ ఉండదు. పైగా ఎంత అనుకున్నా, పెద్ద స్క్రీన్ మీద, సౌండ్ ఎఫెక్ట్స్తో, చీకట్లో పాప్ కార్న్ తింటూ లోకాన్ని మర్చిపోయి సినిమా చూస్తుంటే ఉండే అనుభూతి ఎన్ని సార్లు బుల్లి తెర మీద ఎన్ని సినిమాలు చూస్తే వస్తుంది?
దేవుడా, ఇంకెప్పుడు టీవీలో నేను చూడని సినిమా మాత్రం వెయ్యకుండా చూడు నాయనా!!!

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “టీవీలో కొత్త సినిమా”

  1. radhika Says:

    ha ha..neenu alage anukuntu vunatanamdi.kaani ippudu intlone chudaka tappatledu.

  2. satti babu Says:

    i dont know how to write inthis

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: