మా పని కాదు….

ఇవాళ మా ఆఫీస్ లంచ్ రూంలో లంచ్ చేసి చెయ్యి కడుక్కోడానికి వెలితే అక్కడ ఉన్న 3-4 అమ్మాయిలు చెయ్యి కడుక్కుంటూ ఇలా మాట్లాడుకొంటున్నారు.
ఒకామె అంటోంది-ఎల్ అయి సి ఏజెంట్ ఒకామె కి ప్రీమియం కట్టడానికని చెక్ ఇచ్చిందట.
రిసీట్ ఇవ్వలేదు ఆ ఏజంట్..ఎప్పుడిస్తుందో ఎంటొ…అంటె..
రెండొ ఆమె, ఏమో బాబు ఇలాంటివన్నీ ఆయనె చూసుకుంటారు…
ఈ చిన్న సంభాషణ నన్ను చాలా ఆలోచింప చేసింది.
ఇంత చిన్న విషయాలకి కూడా అవగాహన లేక ఒకళ్ళు అమాయకంగా అడిగితే,ఇంకోళ్ళు నాకసలు తెలుసుకోవల్సిన అవసరమే లేదు, ఆయన చూసుకుంటారు అన్నీ అన్నట్టుగా మాట్లాడటం..
ఎందుకు చాలా మంది ఆడవాల్లు కావలని అజ్ఞానం లో ఉండిపోతారొ.చిన్న క్యూరియాసిటీ ఉంటె చాలు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ఏమంత కష్టం?
మనం సాధారనంగా ఆడవాళ్ళ నుండి వినే మాటలు..
అమ్మో నాకు ఒక్కదాన్నే ఊరు/కొత్త ప్లేస్ కి వెల్లడం భయం,
పోలిటిక్స్ గురించి ఏమైనా డిస్కస్సన్ వస్తే అబ్బా ఈ రాజకీయాలు నాకు అస్సలు అర్దం కావు…
బేంక్, పోస్ట్ ఆఫీస్ లాంటి వాటికి వెల్లి ఏమైన పని చేసుకు రావాలంటె…అమ్మో, ఎలా చెయ్యడం…
ఇవన్నీ ఆడవాళ్ళు తమ రోజు వారి పనులు చేసెందుకు చూపించే నేర్పు, ఓర్పు లో ఒక్క 10% పెట్టినా చాలు నేర్చుకోవచ్చు.
ఒకసారి నేను సీరియస్ గా న్యూస్ చూస్తున్నా..మా తోటికోడలి పాప వచ్చి, పిన్ని న్యూస్ అబ్బాయిలు కదా చూస్తారు,నువ్వు చూస్తున్నవేంటి అని అడిగింది..ఆ చిన్నారి మనసులో ఇంతటి అభిప్రాయం ఎలా కలిగిందో అని నాకు చాల అశ్చర్యం వేసింది.అవును మరి తాతయ్య,నాన్న ఎప్పుడు టీవీ చూస్తుంటారు.నానమ్మ,అమ్మ వంటింట్లో పని చేసుకొంటూ ఉంటారు. ఒకవేల టీవీ చూసే అవకాశం వచ్చినా ఏ సీరియలో చూస్తుంటారు.న్యుస్ చూడటం, పేపర్ చదవటం ప్రతి ఒక్కళ్ళు చెయ్యాలి, అది మగవాళ్ళు మాత్రమే చేసేది కాదమ్మా అని నచ్చ చెప్పాను.

ప్రతి చిన్న విషయానికి మొగుడి మీద ఆధార పడటం ఏదొ గొప్పగా భావిస్తూ ఉంటారు కొంత మంది మహిళలు. చదువుకోని వాల్లంటె కాస్త అర్ధం ఉంది, చదివి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు కూడా ఏమి తెలియనట్టు ఇలా అధారపడటం విడ్డూరంగా ఉంటుంది.సహజంగానె ఆడవారికి, మగవారి టేస్ట్లు ఇంటరస్ట్లు భిన్నంగా ఉంటాయి. అవి అభిరుచుల వరకు ఐతె పర్వాలేదు. మగవారు స్పోర్ట్స్ చూస్తే, ఆడవాలు వంట-వార్పు లేక కుట్లు నేర్పే ప్రొగ్రాం చూడొచ్చు. దీనివల్ల ఎవరికి నస్టం లేదు. కాని, ఇలా దైనందిన జీవితంలో కాస్త కామన్ సెన్స్, ఇంటరెస్ట్ ఉంటె తెలుసుకునే వాటికి కుడా, మాకు చేత కాదు అని చేతులు ఎత్తెయడం ఆడ వాళ్ళ పై చిన్న చూపును కలగ చేస్తుంది.
భార్య సంపాదిస్తుంది, కాని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలొ, ఎలా దాచాలొ, ఇంకం టేక్స్ రిటర్న్ ఎలా ఫయిల్ చేయాలొ ఇలాంటివన్ని మగ వాళ్ళకి వదిలేయాల్సిన అవసరం లేదు.
ఇద్దరు ఆలోచించి నిర్ణయం తీసుకోడంలో తప్పు లేదు. కాని ఇదేదో నా పని కాదు-ఆయనే చూసుకుంటారులె అన్న ధోరణి మంచిది కాదు.

ఇక అబ్బాయిలు తమ పని కాదు, అమ్మాయిలు మాత్రమె చేయలి అనుకునేవి చాలా పెద్ద లిస్టే ఉంది. అది వేరే బ్లాగ్ లో మాట్లాడుకుందాం.

ప్రకటనలు

3 వ్యాఖ్యలు to “మా పని కాదు….”

 1. charasala Says:

  అవునవును. ఈ జాడ్యం నరాల్లో ఇంకిపోయింది. అవన్నీ మా ఆయన చూసుకుంటాడు అని చెప్పడంలో అవి మగాళ్ళ పనులు అవి నేను చేయకుండావుండి వందశాతం ఆడదాన్ని అనడం. మగాళ్ళు కూడా అంతే, ఆడవాళ్ళ పనులు చేయం అంటే నేను అసలుసిసలు మగరాయున్నని చెప్పడం. నేను తిన్న పళ్ళెం నేనే కడుక్కోవడం నాకు చిన్నప్పటినుంచీ అలవాటు. మా ఇంట్లో అందరికీ నేను అలవాటయ్యానుకానీ ఇతరుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు నా కంచం నేను కడుక్కుంటే వాళ్ళకు మహాపరాధము జరిగినట్లుగా భావించడం నేను చూశాను.
  –ప్రసాద్

 2. సుధాకర్ Says:

  ఈ మధ్య వంటలు, అల్లికలు, పిల్లల పెంపకం వీటి ఆధారంగా సంపూర్ణ మహిళ అనే బిరుదులు ఇచ్చేస్తునారు కదా? 🙂

 3. ch.swetha Says:

  నిజమే.ఇలాంతి సంఘటనలు కోకొల్లలు.ఆడవాళ్ళు అన్ని రంగాల్లోను రాణిస్తున్నారు అని చెప్పుకుంటూనే పిల్లలకు కూడా న్యూస్ చూడడం అనేది మగవాళ్ళు చేస్తారు అన్న అభిప్రాయం కలిగేలా ఉన్నామంటే మన రాణింపు ఎంత వరకో అర్ధం చేసుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: