ఒక టీచర్స్ డే రోజు….

ఇవాల టీచర్స్ డే అనగానె ఎప్పుడొ నేను ఆరవ తరగతి లొ జరిగిన విషయం గుర్తొస్తుంది. అప్పుఏఎ హై స్కూల్ లో అడుగు పెట్టిన కొత్త. టీచర్స్ డే ముందు రోజు అన్ని క్లాస్ లకి వచ్చి ఉపన్యాసం ఇచ్చే వాల్లు ఎవరిన ఉంటె పేరు ఇవ్వండి అని అడిగారు.అంతక ముందు ఎప్పుడు నాకు ఉపన్యాస అనుభవం లేదు.తులసి టీచర్ అని మా క్లాస్ టీచర్ ఒకామె ఉండేవారు. నా కళ్ళలో ఆశక్తి గమనించిన ఆవిడ నన్ను పేరు ఇమ్మని ప్రొత్సహించారు.పై తరగతుల వాల్లు ఇంకొంత మంది కూడా తమ పేర్లు ఇచ్చారు. ఐతే ఎం మాట్లాడాలొ తెలీదు. అందరు వాళ్ళ పేరెంట్స్ తో కాని, ట్యూషన్ టీచర్స్ తో కాని మేటర్ ప్రిపేర్ చేఇంచుకొన్నరు. నేను సాయంత్రం ఇంటికి వెల్లి ఒక పేపర్ మీద గురువు గురించి నా అభిప్రాయలు రాసను.
ఆ తర్వాత మా అమ్మ దగ్గరకి వెల్లి..ఇదిగో ఇలా ఉపన్యాసం ఇవ్వాలట. ఇది బాగుందా అని చదివి వినిపించాను. మా అమ్మ పెద్దగ చదువుకోలెదు. కాని నేను అన్ని రంగాలలొ ముందు ఉండాలని ఆవిడ కోరిక. ఏదిన గాని ధైర్యంగా మాట్లాదలి అని ప్రోత్సహించింది.
ఆ మర్నాడు స్కూల్ పిల్లంత కూడి ఒక వేదిక ఏర్పాటు చేసి టీచర్స్ అందరిని సత్కరించిన తర్వాత ఉపన్యాసాలు స్టార్ట్ చేసారు. వరసగా ఒక్కొక్కరు మాట్లదటం మొదలెట్టారు. అందరు సర్వేపల్లి రాధ కృష్న గురించే చెప్తున్నరు. నేనేమొ వేరె వెర్షన్ లో ప్రిపేర్ చేసుకున్నను నా స్పీచ్. చెప్పొచ్చో లేదో తెలీదు.సరే ఇక నా వంతు వచ్చక వెల్లను. మేటర్ రాసుకున్న పేపర్ దగ్గర పెట్టుకుని(మర్లా మర్చిపోతానేమొ అన్న భయంతో) గట్టిగా చాల ధర్యంగా మాట్లాడాను. నేను చెప్పిన విషయాలు అప్పటి వరకు సర్వేపల్లి రాధ కృష్న గురించి విని విని ఉన్న వల్లందరికి కొత్తగా ఉన్నాయి.మా తులసి టీచర్ పిలిచి చక్కగా చెప్పావు, మరి ఆ కాగితం ఎందుకు దగ్గర పెట్టుకోడం…ఈ సారి అలా చెయ్యకు అన్నరు. ఆ తర్వాత నవంబర్ 14 బాలల దినొత్సవనికి ఉపన్యాస పోటీలు పెట్టరు. అప్పుడు ఇంకా బాగ ప్రిపేర్ అయ్యి ఫర్స్ట్ ప్రైజ్ సాదించాను.
ఇంక అక్కడ నుండి 10వ తరగతి వరకు అన్ని రంగాల్లొ మొదటి బహుమతులు నావే.
ఆ రోజు ఆ మొదటి ఉపన్యాసానికి మా టీచర్, మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నాకు తొలి మెట్టుగా నిలిచింది.
అసలు ఇదంతా జరిగింది అని ఆ టీచర్ ఎప్పుడొ మర్చిపోయి ఉంటారు. కాని నా మనసులో దాదాపు 15 సంవత్సరలు పైనే ఐనా పదిలంగా ఉంది. ఇప్పటికీ టీచర్స్ డే అంటె ఈ సంగటన గుర్తు రాకుండ ఉండదు. ధైర్యంగా 10 మంది ముందు నిలబడి మాట్లదటం నేర్చుకున్నది, నా మీద నేను నమ్మకాన్ని పెంచుకున్నది ఇవాళే మరి!!

ఒక టీచర్స్ డే రోజు….

ప్రకటనలు

2 వ్యాఖ్యలు to “ఒక టీచర్స్ డే రోజు….”

  1. cbrao Says:

    టీచర్స్ డే రోజు సందర్భంగా పాత జ్ఞాపకాలు గుర్తుకురావటం బాగుంది.స్కూల్ తర్వాత మీరు వక్త్రుత్వ పోటీలలో పాల్గొనడం గురించి ఇంకోసారి రాస్తారా? మీ వ్యాసం లెఖినిలో పోసాక వచ్చెదాన్లో అచ్చుతప్పులు సరి చూసుకోండి.

  2. radhika Says:

    baagundandi mee rachana.chinnanaati samgatulu enni ceppukunna..taragavu,taniviteeravu kadaa.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: