ఎలా రాస్తారబ్బా?

త్రివిక్రం గారు…మీ బ్లాగ్ బాగుంది కాని అక్షర దోషాలు లేకుండా రాయండి అన్నారు..నిజమె, ఎమైనా రాయాలంటే నాకు ఇదొక ఇబ్బందిగా తయారైంది.
మీరంతా ఒక్క అక్షర దోషం కూడా లేకుండా ఎలా రాయగలుగుతున్నారో నాకు చాలా అశ్చర్యంగా ఉంటుంది…నేను ఒక బ్లాగ్ రాయలంటె బోలెడు సేపు పడుతోంది..
లేఖిని భాష కి ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు.ఎక్కడొ ఒక చోట కేపిటల్ లెటర్ రాయడం మిస్స్ అవుతుంది. దానితొ ఈ తిప్పలన్నీ…బ్లాగ్ రాసేసాక కుర్చుని మర్లా కరెక్ట్ చేసుకొంటున్నా…ఐనా నా కళ్ళకు దొరక్కుండా తప్పించుకొని కొన్ని అక్షర దోషాలు వచ్చేస్తూ ఉన్నాయి..
ఇలా తప్పులు రాస్తున్నానని నా తెలుగును మాత్రం శంకించకండే!!
ఇలా ఇంగ్లీష్ తెలుగు రాయడం రావట్లేదు..అంతే!! తప్పులు లేకుండా ఎలా రాయలో, మీరంతా అంత పెద్ద పెద్ద వ్యాసాలు ఎలా రాసి పారెస్తారో కాస్త చిట్కాలు చెప్తే ధన్యురాలిని..

ప్రకటనలు

4 వ్యాఖ్యలు to “ఎలా రాస్తారబ్బా?”

 1. cbrao Says:

  తెలుగుబ్లాగ్లో సభ్యుడిగ చేరిన కొత్తల్లో నా జాబులన్నీ అంగ్లంలోనే ఉండేవి. చదువరి సలహాతో లేఖినిలో రాయటం మొదలుపెట్టాక తెలుగులో చిన్న చిన్న వాక్యాలతో మొదలై నేడు బ్లాగు సమీక్ష ఆసాంతం తెలుగులో రాస్తున్నాను. అవీ – ఇవీ, త్రివిక్రం బ్లాగు పై సుదీర్ఘమైన సమీక్ష తెలుగు లో రాసా, కృషితో, లేఖినిలో. అభ్యాసంతో మీరు చరసాలను మించి రాయగలరు,లేఖిని ఉపయోగిస్తూ.

 2. త్రివిక్రమ్ Says:

  చక్కటి భాష, అందమైన భావాలు, పదునైన ఆలోచనలు మీ బలాలు. రావుగారు చెప్పినట్లు కాస్త శ్రద్ధ తీసుకుని సాధన చేస్తే ఎవరైనా తప్పుల్లేకుండా రాయగలుగుతారు. ఇక పెద్ద పెద్ద వ్యాసాలు రాయగలగడానికి కారణాలు(నా వరకు): బ్రహ్మచారిని కావడం, ఇతర వ్యాపకాలేవీ లేకపోవడం, సొంత కంప్యూటర్ ఉండడం, (మొన్నటివరకూ) కీబోర్డు నాకు బాగా సహకరించడం. (అది ఇప్పుడు మొరాయిస్తోంది కాబట్టే దాని విలువ గుర్తించగలిగాను :D)

 3. suman Says:

  hello friend this is suman frm hyd
  ee blog chala bagundhi…..kani ella rayalo andharaki telise la uvnte baguntundhi………..

 4. గుత్తిన Says:

  ఈ సైట్ మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే.
  http://www.quillpad.in/telugu/

  అక్కడ మనం రాసేవి మన మొబైల్ ఫోన్ లో predictive text లాగా పనిచేసి తనంతట తనే సరిచేసుకుంటుంది. కానీ పెద్ద సమస్య ఏమిటంటే, కొన్ని సంక్లిష్ట పదాలని రాసే అవకాశం ఏమాత్రం లేదు. అక్కడ చూపించిన పదాలనే వాడుకోవాలి. ఏదైన పదం తప్పు వస్తే, దానిమీద క్లిక్ చేస్తే పదాల పట్టిక (లిస్ట్) చూపిస్తుంది. కావలసిన పదాన్ని ఎంచుకోవటమే. ఆ పట్టికలో మనకి కావలసిన పదం లేకపోతే ఇంతే సంగతులు. బయట వేరే ఎడిటర్ లో రాసి, నకలు ఇక్కడ అతికించుకోవాలి (అదే copy-paste)

  ఉపయోగపడుతుందని ఆశిస్తూ
  శాస్త్రి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: