నిమ్మరసం

క్షీణిస్తున్న కేసీఅర్ ఆరొగ్యం అంటూ నిన్న వార్తల్లొ ఒకటె మోత. పాపం నిరాహార దీక్ష మొదలెట్టి ఎన్నలైందో ఎమొ అనుకున్న ( నాకు సరిగ్గ గుర్తు లేదులె)…తీరా చూస్తే 36 గంటలు కూడా అవలేదట. బక్క ప్రాణి, తొందరపడి పూనుకున్ననా, నిమ్మరం ఎపుడు తాగెద్దామా అని చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఆయన వాలకానికి నిజంగా నవ్వాగలేదు. బొబ్బిలి రాజ సినిమాలొ వాణిశ్రీ ఇలాగె నిరాహార దీక్ష తలపెట్టి తెగ పాట్లు పడుతుంది.తెల్లారి లెచి పేపర్ చూస్తే ఇంకేముంది గ్లాస్ తో నిమ్మరసం సేవిస్తు మన నాయకుడు. శరద్ పవార్ ఎపుడు వస్తాడొ ఎపుడు తిండి తినేద్దమా అని నక్కలాగ ఎదురుచుస్తున్న (అచ్చం నక్కలాగె సన్నగ బలె ఉంటాడు కదా….అందుకె అలా పోల్చాను)ఆయన వాలకం గుర్తొచ్చి పొనీలే ఈ విదంగా విముక్తి పొందాడు అనుకున్న. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఎలా చేసారబ్బా నిరాహార దీక్ష అనిపించింది. కేసీఅర్ గారి లక్షం తెలంగాణా గురించి దేశం మొత్తం తెలిసేట్టు చెయడం మాత్రమె అటలే.తెలంగాణ వచ్చే వరకూ కాదట.2 ఏల్లు పడుతుంది మరి అప్పటి వరకు అంటె!! ఈ మాత్రానికి ఆఆమరన నిరాహార దీక్ష అని పేరు పెట్టుకొడం ఎందుకొ? ఒక బక్క మనిషి 1 1/2 రోజులు అన్నం మానెస్తే నేతలు భలే దిగి వచ్చేసారి!!! డిల్లీ వదిలి హైదరాబాద్ కి చేరుతుందట ఆయన ఉద్యమం. మరలా ఎపుడైనా నిరాహార దీక్ష పేరు ఎత్తితే మనకి నిమ్మరసం కోసం ఆత్రంగా ఎదురు చూసే ఆ మొహం గుర్తు రాకుండా ఉంటుందా?

ప్రకటనలు

ఒక స్పందన to “నిమ్మరసం”

  1. త్రివిక్రమ్ Says:

    పాపం! నిరాహారదీక్ష ముగించేశాక ఇంటికెళ్ళే ఆత్రంలో అసలెవరితోనూ-కనీసం తనపార్టీ సహచరులతోనైనా -ఒక్క ముక్క కూడా మాట్లాడలేదట.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s


%d bloggers like this: