చదువరి బ్లాగ్ లో రాసినట్టు…భాషా దోషాల లాగానే.. మన నిత్య జీవితంలో మనకి ఇంకా బోలెడన్ని కంఫ్యూజన్ లు ఉంటాయి.అవన్నీ మొదలెడితే పెద్ద బ్లాగే రాయొచ్చేమో..ఇంత వయసు వచ్చీ, ఇంత చిన్న విషయం లో కంఫ్యూజనా అని మనలో మనమే చింతించే బదులు ఇలా బ్లాగ్ లో నలుగురితో పంచుకుని హాయిగా నవ్వేసుకుని, మన లాగే ఇంకొంత మంది ప్రబుద్ధులు ఇదే తరహా లో వున్నారులే అని తృప్తి పడొచ్చు.
కుడికి, ఎడమకి తేడా తెలియని వాల్లు చిన్న పిల్లలే కాదు…పెద్ద వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.నా స్నేహితులలోనే ఒక 25% మంది ఉన్నారు.ఒక స్నేహితురాలు ఐతే…నాకు స్కూటీ ఉండేది, తనని కూడా నేర్చుకో, నేను నెర్పిస్తాను అంటే…ఎంత బతిమాలినా వద్దు అనేది…పాపం భయం ఏమోలే అనుకునే దాన్ని. కాని ఒక రోజు చెప్పింది…నాకు కుడి, ఎడమ కన్ ఫ్యూజనే….ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఎవరైనా కుడి వైపు తిరుగు అంటే, నేను చేతులు ఒకటికి, రెండు సార్లు సరి చూసుకుని, ఏదో తేల్చుకుని వెళ్తాను ….బండి నడుపుతూ అంత సేపు కస్టం కదా! అని…సరదగా అంటొందేమో అనుకున్నా కానీ…అది నిజమే చెప్తోందని తెలిసాక అశ్చర్యంతో నోరెల్ల బెట్టాను.
అలాగే ఏ నెలలో ఎన్ని రోజులుంటాయో…టక్కుమని ఎవరైన అడిగితే…దాదాపు 50% మంది పైనే సరిగ్గా చెప్పలేరు.చిన్నపుడు, ఏ నెలకి ఎన్ని రోజులో గుర్తు పెట్టుకునే కొన్ని చిట్కాలు ఉండెవి…బహుశా అందరికి తెలిసే ఉంటుంది. మన చేతి వేళ్ళూ అన్నీ మూసి,పిడికిలి వెనక్కి తిప్పి…వేలి మొదట్లో ఉండే కనుపులు, లోతులు ఆధారంగా…ఎడమ వైపు నుండి మొదలెట్టి, మొదతి ఎత్తుగా ఉండెది జనవరి నెల అనుకుంటె అది…31 రోజులు, పల్లం ఉన్న చోట 30 రోజులు…ఇలా డిసంబర్ వరకు లెక్క పెట్టించే వారు.
భాషా దోషాలు ఐతే క్రమేపి సరి దిద్దు కుంటాం. కానీ…ఇలాంటి విషయాల్లో బాల్యం నుండి…ఆ కంఫ్యూసన్ అలాగే ఉండిపోతుంది…నాకు ఇప్పటికి…లిజార్డ్ కి లెపార్డ్ కి కంఫ్యూజనే…ఒక సెకన్ ఆగి…లిజి అంటే బల్లి కదా అని గుర్తు తెచ్చుకుంటాను…
ఇవి కాక కంఫ్యూజన్ తో నేను నిత్య జీవితంలో చేసిన కొన్ని పనులు చూడండీ…
నేను హాస్టల్ లొ ఉండగా…ఒక రోజు కొత్తగా మీరా షాంపూ మార్కెట్ లో వచ్చిందని ఒక బోటిల్ కొని తెచ్చుకున్నాను(మాములుగా ఇతర షాంపూ ధరల కంటే దీని ధర ఒక 30% తక్కువగా ఉండటంతో మురిసిపోయి మరీ)…మర్నాడు…స్నానానికి హుషారుగా బాత్ రూంలోకెల్లి తల పై షాంపూ వేసుకుని రుద్దు కోవడం మొదలెట్టా…నురగ రావట్లేదు. ఎంటబ్బా…ఇది కానీ నురగ రాకుండా క్లీన్ చేసే కొత్త షాంపూ కాదు కదా అనుకొని…ఇంకాస్త వెయ్యలేమొ అని మరింత నెత్తి మీద పోసాను….ఊహూ…ఇంకా నురగ రావట్లేదు….అప్పుడు అనుమానం వచ్చి బోటిల్ మీద చూస్తే తెల్సింది…అది షాంపూ కాదు-తల నూనే అని….ఆ తర్వాత మా స్నేహితులు ఈ విషయం గుర్తు చేసి కనీసం ఒక నెల ఏడిపించారు నన్ను.
ఒక రోజు మా అక్క, అమ్మ బజార్ కి వెళ్తూ, అక్క వాళ్ళ 2 ఏళ్ళ బాబు ని చూసుకోమని నాకు అప్పగించి వెళ్ళారు. ఒకసారి పాలు కలిపి ఇవ్వు ఏడిస్తే అన్నారు. వాళ్ళు వెళ్ళాకా, కాసేపటికి పాలు కలిపి బాబుకి తెచ్చి ఇచ్చాను. వాడు కాస్త తాగి ఇంక ససేమిరా తాగను అంటాడు. ఎందుకో అర్ధం కాక,సర్లే ప్రస్తుతం ఏడవట్లేదు కదా…వాళ్ళ అమ్మ వచ్చి చూసుకుంటుంది కదా అని ఊరుకున్నాను. ఆ తర్వాత మా అక్క వచ్చాక వంటింటిలోకి వెళ్ళీ గ్లాస్ చూసి నన్ను పిలిచి అడిగింది…పాలలో పంచదార కలిపావా అని…దానికి నేను, ఆ కలిపాను అని డబ్బా చూపిస్తే…అది పగల బడి నవ్వింది.ఇంతకు నేను కలిపింది…పంచదార లాగే అంత సైజ్లో ఉన్న సగ్గు బియ్యం. వేమన గారు ఉప్పు-కర్పూరం ఒక్క పోలికలు అన్నారు కానీఎ…ఈ పంచదార-సగ్గు బియ్యం చెప్పలేదు చెప్మా అని ఒక సారి ఆ పద్యం గుర్తు చేసుకున్నాను.
ఇలా నిత్య జీవితంలో మనం అమాయకత్వం వల్లనో, అజ్ఞానం వల్లనో కంఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. తర్వాత తల్చుకుంటే నవ్వు తెప్పిస్తాయి. ఈ మత్రం నేను చూసుకోలేదా అని ఆశ్చర్య పరిచేలా ఉంటాయి.