ఈ రోజు చాలా బాగుంది…

ఎందుకంటే..

కాస్త నలతగా ఉంది అని మా అబ్బాయి ఇవాళ స్కూల్ కి వెళ్ళనమ్మా అని అడగటం – దగ్గరలో పరీక్షలు,ఎప్పుడొస్తాయో తెలియని తెలంగాణ బంద్ లు,వీటన్నిటి మధ్యా సరిగా జరగని క్లాసులు.. ఇవన్నీ పక్కన పెట్టేసి – ఒక్క రోజు స్కూల్ మానేస్తానని అడిగే హక్కు వాడికి ఉందని ఎరిగి, సంతోషం గా అంగీకరించేసాను కాబట్టి!

ఈ నగర ట్రాఫిక్,బోలెడు దూరం, దొరకని టైము.. ఇవన్నీ పక్కన పెట్టి,వీలు చిక్కించుకుని చివరి రోజుల్లొ ఉన్న ఒక బంధువులాయన్ని చూడటానికి వెళ్ళి, ఆయన నన్ను గుర్తు పట్టలేకపోయినా,ఆ కళ్ళల్లో ఒక చెప్పలేని తృప్తిని చూసాను కాబట్టి!

హడావిడిగా ఆఫీస్ కి పరిగెత్తుతున్న నేను, ఒక క్షణం ఆగి ఎంతో ఉత్సాహంగా టా టా చెబుతున్న 3 ఏళ్ళ మా వాచ్ మాన్ కొడుకుకి నేను కూడా అంతే ఉత్సాహం తో చెయ్యి ఊపి చెప్పగలిగాను కాబట్టి!

గొడుగు మర్చిపోయి బయటకి వెళ్ళిన నేను, చాలా ఏళ్ళ తరువాత హాయిగా వర్షం లో తడిచాను కాబట్టి!

వర్షానికి చిత్తడిగా ఉన్న మట్టి నేలలో కదులుతున్న వాన పాముని, మొక్కల్లోంచి గెంతుకుంటూ వస్తున్న కప్ప పిల్లని మ అబ్బాయికి ఈ నగర వాతవరణం లో సైతం చూపించగలిగాను కాబట్టి!

టీ వీలో వస్తున్న న్యూస్ ఐటెంస్ వినకుండా, అదే పనిగా మోగుతున్న సెల్ ఫోనుని ఖాతరు చేయకుండా, తర్వాత చెయ్యాల్సిన పనులని పట్టించుకోకుండా….పెరుగు అన్నంలోకి నంజుకొంటున్న మాగాయ టెంకని ఒక పావు గంట సేపు చీకుతూ కుర్చోగలిగాను కాబట్టి!

ఇక, చివరిగా….ఎన్నో సార్లు రాయాలనిపించి, ఇప్పుడేం రాస్తాములే అని ఆపేసే నేను – ఇన్నాళ్ళకి బ్లాగ్ లొ ఒక కొత్త పోస్ట్ రాయగలిగాను కాబట్టి!

2 స్పందనలు to “ఈ రోజు చాలా బాగుంది…”

  1. రసజ్ఞ అన్నారు:

    హహహ బాగుందండి

  2. lakshmi raghava అన్నారు:

    హాయి గా అని పించింది…అప్పుడప్పుడూ ఇలాటి బ్రేక్ అవసరం కానీ తెలంగాణకోసం ఈబందు లతో ప్రతిరోజూ ఇంట్లో కూర్చోవాల్సి వస్తే???

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )


Follow

Get every new post delivered to your Inbox.