కొన్ని బ్రాండ్ పేర్లు ఆ వస్తువు కి పర్యాయ పదంగా మన వాడుకలో వాడేస్తూ ఉంటాం.బహుశా మొట్ట మొదట మనకి ఆ వస్తువును పరిచయం చేసిన బ్రాండ్ నే ఇంక ఆ వస్తువుకు ఖరారు చేసేస్తామనుకుంట.నేను గమనించినవి-నాకు తెలిసిన అన్ని ఇళ్ళల్లో వీటిని ఇలాగే పదాలు గానే వాడుతూ ఉంటారు.
“సర్ఫ్” -ఒక గృహిణి పని మనిషితో:నీళ్ళల్లో ఇంత సర్ఫ్ వేసి నానబెట్టా,ఇంకా ఎందుకు అంత సబ్బు రుద్దేస్తున్నావ్?ఇక్కడ ఆ గృహిణి ఉద్దేశ్యం బాగ వాషింగ్ పౌడర్ వేసాను అని.ఇప్పుడు వాషింగ్ పౌడర్లో ఎన్ని రకాల బ్రాండ్స్ వచ్చినా సరే,సర్ఫ్ అనేది వాషింగ్ పౌడర్ కి పర్యాయ పదం అయిపోయింది.ఏరియల్/వీల్/రిన్ ఇలా ఏ వాషింగ్ పౌడర్ వాడుతున్నా సరే దాన్ని సర్ఫ్ అనే సంబోదిస్తారు చాలా మంది.
“టార్టాయిస్”:అబ్బా దోమలు చంపేస్తున్నాయి, ఒక టార్టాయిస్ వెలిగించరా బాబు-అంటే మస్కిటో కోయిల్ కి పర్యాయంగా అన్న మాట! (మార్టిన్ లాంటి చాల రకాల కాయిల్స్ ని కూడా కొత్త టార్టాయిస్ అనే పిలిచేస్తూ ఉంటారు)
“ఒడామస్”:దోమలు కుట్టకుండా రాసుకునే పై పూత.అసలు ఈ వస్తువు పేరు ఏంటో నాకు కూడా తెలీదు.వళ్ళంతా ఒడోమస్ రాసేసుకో-దోమలు కుట్టవ్ అనడమే తెలుసు.ఈ ప్రొడక్ట్ లో వేరే బ్రాండ్ వి ఉన్నాయొ లేవో కూడా తెలీదు.
“ఫ్యారెక్స్”:5 వ నెల వచ్చింది కదా మీ బాబు కి-ఫ్యారెక్స్ పెట్టడం మొదలెట్టారా లేదా? అంటే సెరల్స్ తో చేసిన రెడీ మేడ్ ఆహార పధార్ధం అన్న మాట. పాత కాలపు తల్లులు ఖచ్చితంగా ఈ మాటే వాడతారు.ఇప్పటి వారు మాత్రం ‘సెరెలాక్’ ఇలా ఆయా బ్రాండ్ ని చెప్తారు కాని.
“టినోపాల్”:తెల్ల బట్టలు ఉతికాక కాస్త టినోపాల్ పెడితే మిల మిల మెరుస్తాయి.ఇక్కడ టినొపాల్ అంటే వైటెనింగ్ ఏజంట్.కాని బ్రాండ్ పేరు నే వాడుకలో ఆ వస్తువు పేరులా వాడేస్తారు.
“మిల్క్ మైడ్“:దీన్నే గొల్ల బామ డబ్బా అని కూడా అంటారు.స్వీట్స్ చేయడానికి వాడతారు.స్కిం చేసిన చిక్కటి తియ్యటి పాలు.ఇది కూడా బ్రాండ్ పేరుని ఆ వస్తువు పేరుగా వాడేసేదే.
“బ్రూ”: నాకు ఫిల్టర్ కాఫీ వద్దు-బ్రూ కావాలి అంటూ ఉంటాం. అంటే ఇన్స్టంట్ కాఫీ కి బ్రూ అనేది పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం.
మీకూ ఇలాంటివేమైనా స్పురణకు వస్తే జత చేయండి…
12:21 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 28, 2008
xerox
google
windows
12:23 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 28, 2008
అలాగె “జెరాక్స్” … అంటే ఫొటోకాపి కి “జెరాక్స్” అనేది పర్యాయ పదంగా వాడుతూ ఉంటాం.
2:31 అపరాహ్నం వద్ద ఏప్రియల్ 28, 2008
daalda ( for Vanspathi)
11:05 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 29, 2008
jeep ,
J.C.B(అసలు పేరు యంగ్ హో)జె సి బి అనేది కంపేనీ పేరు
6:33 పూర్వాహ్నం వద్ద మే 16, 2008
nirodh (condome name)
4:29 పూర్వాహ్నం వద్ద నవంబరు 14, 2008
ఇంకా చాలా వున్నాయండి బాబు…
రిన్ సబ్బు
లైబాయ్ సబ్బు
లక్స్ సోప్
నిర్మ పొవ్డర్
ఇంకా చాలా …ఉన్నాయండి